ఆంధ్రప్రదేశ్‌

అవినీతి పునాదులపై కడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతిపై మండలిలో విపక్ష నేత రామచంద్రయ్య
విజయవాడ, మార్చి 11: రాష్ట్ర రాజధాని అమరావతిని పాలకులు అవినీతి పునాదులపై నిర్మించాలని చూస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ఆరోపించారు. భూసమీకరణపై పెల్లుబుకుతున్న అవినీతి ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాతరు చేయనప్పటికీ విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. ఏమాత్రం అనుభవం లేని మంత్రి నారాయణకు రాజధాని వ్యవహారాన్ని అప్పగించడం అవివేకమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త, కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహిస్తుంటే ఎవరు ముందుకొస్తారని పిసిసి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. కేంద్రం వృద్ధిరేటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు రెట్టింపుగా వుందంటూ ఎక్కువ చేసి చూపడం హాస్యాస్పదమన్నారు. కాగ్ నివేదికను బయటపెడితే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. 13 జిల్లాల పరిపాలనకు 20 మంది సలహాదారులు ఎందుకని రామచంద్రయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.