రాష్ట్రీయం

రంగు మారిన ధాన్యం కొనాలి: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 24: రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన బీభత్సాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రైతులు తీవ్రంగా దెబ్బతిన్నందున తక్షణసాయం అందించాలని డిమాండ్‌చేశారు. పంటనష్టాన్ని వెంటనే అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రత్యేక కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం రైతులపై అశ్రద్ధ చూపుతోందన్నారు. రైతులను ఆదుకోకుండా తాత్సారం చేస్తుందన్నారు. నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వర్షాల కారణంగా తీవ్ర విధ్వంసం జరిగితే కేంద్రాన్ని 1000 కోట్లు కోరడం ఆక్షేపణీయమన్నారు. హుధుద్ తుఫాన్ సమయంలో దేశ ప్రధాని, కేంద్రమంత్రి స్వయంగా వెయ్యి కోట్లు ప్రకటించి ఏడాది గడిచినప్పటికీ 150 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 11 వేల రూపాయలు వేతనం చెల్లిస్తుండగా సబ్ కమిటీ పేరుతో 8 వేలు చెల్లించేందుకు ప్రయత్నించడం వారి శ్రమను దోచుకోవడమేనన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సబ్ కమిటీని మరలావేసి స్పష్టమైన వైఖరితో సహాయం చేసేందుకు కృషి చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.