ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో ‘మీ ఇంటికే మీ రేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఎపి పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ-పాస్ విధానంలో సమస్యలను అధిగమించేందుకు సర్వర్ల సంఖ్యను పెంచుతున్నామని ఆమె బుధవారం ఇక్కడ అధికారులతో సమీక్ష అనంతరం విలేఖరులకు తెలిపారు. అనారోగ్యం పాలై నడవలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం ‘మీ ఇంటికే మీ రేషన్’ విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ‘చంద్రన్న కానుక’ పేరిట పండగల సందర్భంగా పేదలకు ఉచితంగా ఇస్తున్న సరకుల్లో నాణ్యతపై దృష్టి సారించామని, అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.