రాష్ట్రీయం

హడలెత్తిస్తున్న స్మగ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవైపు ఎర్రచందనం...మరో వైపు పులుల కోసం
కడప, డిసెంబర్ 28: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకే అటవీ, పోలీసుశాఖల అధికారులు అష్టకష్టాలు పడుతుండగా, తాజాగా పులుల స్మగ్లర్లు ప్రవేశించి వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. జిల్లా సరిహద్దులోని లంకమల, నల్లమల అడవుల్లో తాజాగా పెద్దపులులు ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు నిర్థారించారు. లంకమల అడవులు ఇటు కర్నూలు జిల్లా నలమల అడవులు , కడపజిల్లా సరిహద్దులోని శేషాచలం అడవులు, నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో గల రాపూరు అడవులు కలిసిపోయి ఉండటంతో లంకమల అడవుల్లోకి పెద్దపులులు ప్రవేశించినట్లు ఇటీవల అధికారులు అమర్చిన కెమెరాల ద్వారా నిర్థారించారు. ఇప్పటికే చిరుత పులులు జిల్లాలో పదుల సంఖ్యలో లంకమల, శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నాయి. బద్వేలు ప్రాంతంలోని లంకమల అడవుల్లో 25వేల ఎకరాలు పైబడి ప్రాంతాన్ని టైగర్ కారిడార్‌గా నిర్థారించి అందులో చిరుతపులులు, పెద్ద పులులను వణ్యప్రాణి సంరక్షణశాఖ అధికారులు గుర్తించారు. గతంలో చిరుతపులులు జిల్లాలోని శేషాచలం అడవులనుంచి సానిపాయి అడవుల ద్వారా బద్వేలు, ఒంటిమిట్ట ప్రాంతాల్లోని జనవాసాల్లోకి రాకతో వాటిని తిరుపతి జూపార్కు అధికారులు తీసుకెళ్లారు. సిద్దవటం అడవుల్లో కొందరు స్మగ్లర్లు చిరుత పులులను వేటాడి వాటి చర్మం, దంతాలు, గోర్లను తీసుకెళ్లారు. తాజాగా పెద్ద పులులు ప్రవేశించడంతో వాటిని ప్రాణంతోనే పట్టుకుని తీసుకెళ్లేందుకు హర్యానా, మద్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ స్మగ్లర్లు వ్యూహం పన్నుతున్నారు. పులుల స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.కె.్ఫరీడా అటవీశాఖ ఉన్నతాధికారులకు రెండురోజుల క్రితమే ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లలో హర్యానా, మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో వారి ద్వారా పెద్దపులుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. పులుల స్మగ్లింగ్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర అటవీశాఖ అధికారులు జిల్లా అటవీశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నలమల అటవీప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలివికోడి రెండు దశాబ్దాల క్రితం సంచరించిన ఆనవాళ్లు ఉండటంతో వాటిని గుర్తించేందుకు మహారాష్ట్ర, ముంబాయికి చెందిన అటవీ శాస్తవ్రేత్తలు దశాబ్దకాలంగా లంకమలలో కెమెరాలు ఏర్పాటుచేసుకుని కలివికోడి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకోసం కోట్లాదిరూపాయలు ఖర్చుచేసినా కలివికోడి ఆచూకీ కన్పించలేదు. వాటికోసం వినియోగించిన కెమెరాలు, వాటిస్థావరాల్లో ఫారెస్టు అధికారులు పెద్ద పులులు, చిరుతపులులు గుర్తించేందుకు సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై డిఎఫ్‌ఓ మోదీన్ దివాన్‌ను సోమవారం మాట్లాడుతూ లంకమల అడవుల్లో కెమెరాలు ఏర్పాటుచేసింది వాస్తవమేనన్నారు.