రాష్ట్రీయం

ఇదీ పవర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగుకు 9 గంటల విద్యుత్ ఖాయం
2.5వేల కోట్లతో 8930 మెగావాట్లు
సిద్ధమవుతున్న సింగరేణి, భూపాలపల్లి
విద్యుత్ సమీక్షలో అధికారులు వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 4: వచ్చే మార్చినుంచి సాగుకు పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరాకు సర్కారు సన్నద్ధమవుతోంది. తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలంటే 8930 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ పరిస్థితుల్లో 2.5వేల కోట్లతో సాగుకు సరిపడా విద్యుత్ సరఫరాకు అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో సమావేశమయ్యారు. వర్షాభావ పరిస్థితి, ఇతర సమస్యలతో నాగార్జున సాగర్‌లో మూడువేల మెగావాట్ల విద్యుదుత్పత్తికిగాను 140 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరగడం వల్ల, మిగిలిన విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు 8930 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అధికారులు వివరించారు. 2.5వేల కోట్ల వ్యయంతో అవసరమైన విద్యుదుత్పత్తికి పనులు మొదలెట్టినట్టు వివరించారు. మార్చినాటికి సింగరేణి పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమై 12 వందల మెగావాట్లు, వరంగల్ జిల్లా భూపాలపల్లి పవర్ ప్లాంట్ నుంచి ఆరు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని జెన్‌కో అధికారులు వివరించారు. ప్రస్తుతం 2500 నుండి 2700 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, భూపాలపల్లి, సింగరేణి పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే కొంత వెసులుబాటు లభిస్తుందన్నారు.
సచివాలయంలో నిర్వహించిన ఎన్‌డిపిసిఎల్ సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ట్రాన్స్‌కో జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎంపిడిసిఎల్ సిఎండి వెంకటనారాయణలతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంపైన, సిఎంపైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఆశలు నెరవేర్చేలా విద్యుత్ అధికారులు పని చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను జిల్లా ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, చెన్నయ్య, కోనేరు కోనప్ప, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు ప్రస్తావించారు. చిన్న సమస్యలు కూడా సిఎం వరకూ వెళ్లకుండా అధికారులు చూడాలని, సమస్యలను పరిష్కరించాలని జగదీశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు తరుచుగా ఎందుకు కాలిపోతున్నాయో సాంకేతిక కారణాలు గుర్తించాలని అధికారులకు సూచించారు.