రివ్యూ
పేరుకే వజ్రాలు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాగోలేదు* వజ్రాలు కావాలా నాయనా
*
నటీనటులు: అనిల్ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖితా బీస్ట్, విజయ్ సాయి,
పొట్టి చిట్టిబాబు తదితరులు
కెమెరా: పి అమర్‌కుమార్
సంగీతం: జాన్ పోట్ల
నిర్మాత: కిషోర్‌కుమార్ కోట
దర్శకత్వం: పి రాధాకృష్ణ
*
ఎలాగైనాసరే డబ్బు సంపాదించటం, ఆనందంగా గడపడం అనే అంశం చుట్టే యువత ఆలోచనలు తిరుగుతున్నాయి. పని ఏదైతేనేం, డబ్బు సంపాదనే ముఖ్యం. సంపాదించినోడే మగాడు. అదీ ఈజీ మనీ అయితే.. ఇంకా హ్యాపీ అన్న ధోరణితోవున్న యువత తక్కువేం కాదు. మనీ దీపం చుట్టూ తిరుగుతూ శలభాల్లా ఎలా మాడిపోతున్నారు అనే అంశాన్ని తీసుకుని, ఓ సందేశం ఇచ్చేలా ‘వజ్రాలు కావాలా నాయనా?’ చిత్రాన్ని రూపొందించడం వరకూ బాగానే ఉంది. కానీ చిత్రీకరణలో నిజాయితీ ఎంత? అన్న ప్రశ్న సినిమా చూశాక ఉద్భవించక మానదు.
ప్రేమ్ (అనిల్ బూరగాని), తన స్నేహితులైన స్వీటీ (నిఖితా బీస్ట్), వేదిక, పండు (విజయ్‌సాయి), రాజేష్‌లతో బ్యాచిలర్ జీవితం గడిపేస్తుంటాడు. ఏదో ఉద్యోగం వెతుక్కునే వెదుకులాటలో ఉంటూ ఎలాగైనాసరే డబ్బు సంపాదించాలని పథకాల మీద పథకాలు వేస్తుంటాడు. చివరికి ఊరు చివరనున్న రాణి నిలయం అనే పెద్ద బంగళాలో ఉన్న రాణిగారి (నేహాదేశ్‌పాండే) నగలపై మిత్రుల కన్ను పడుతుంది. ఎలాగైనాసరే వజ్రాలను సంపాదించి, ఐదారుతరాల జీవితాలను ఆనందమయం చేయాలన్న ఆలోచనతో బంగళాకు వెళతారు. అక్కడ రాణి కనిపించీ కనిపించనట్టుగా వారితో దోబూచులాడుతుంది. చివరికి రాణి, ఆమె బాబాయి, ఆ ఇంటి సెక్యురిటీగార్డు అందరూ ఎప్పుడో చనిపోయారన్న నిజం మిత్రులకు తెలుస్తుంది. కథేంటి ఇలా అడ్డం తిరిగింది? అనుకుని వారిలో వారే అనేక ఊహోపాయాలు పన్ని వజ్రాలు చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వారి ప్రయత్నాలన్నిటికి రాణి ఆత్మ సహకరించినట్టు ఉంటూనే ఒక్కోసారి ఒక్కొక్కరి శరీరంలోకి వచ్చి మిగతా వాళ్ల దుమ్ము దులుపుతుంది. దెయ్యం దెబ్బలు తట్టుకుంటూ ఎలాగైనాసరే వజ్రాలను చేజిక్కించుకోవాలన్న ఆశతో అదే బంగ్లాలో గడిపే వారికి చివరికి తెలిసిందేంటి? అనేదే ముగింపు.
మొదటి భాగాన్ని అసందర్భ సన్నివేశాలు, కుర్రకారు ఎంజాయ్‌మెంట్ సీన్లతో ముగించేశారు. వజ్రాల కోసం రాణి బంగ్లాకు వెళ్లడం వరకూ బాగానే ఉన్నా, రాణికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ కథనంలో ఎక్కడా బిగి కనబడదు. అసలలా ఎందుకు జరిగి ఉంటుంది? అన్నదానికి రీజన్ ఏదీ లేదు. కథకుడు చెప్పాడు కాబట్టి దర్శకుడు తీశాడు అన్నట్టే ఉంటుంది. ఓ దెయ్యం కోసం మరో రెండు దెయ్యాలు సహాయం చేయడానికి వచ్చాయట. వాటే పిటీ!? ప్రేమ్, స్వీటీల మధ్య వచ్చే లవ్ సన్నివేశాల్లో ఎలాంటి కెమిస్ట్రీ పండలేదు. ముఖ్యంగా కామెడీ కోసం పెట్టుకున్న పాత్ర నరసింహం (పొట్టి చిట్టిబాబు) పాత్ర అన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. ప్రతీ సీన్‌లో స్పూఫ్‌లు పేరిట పెట్టిన కామెడీ ఏడిపించింది. స్ఫూఫ్‌లు పెట్టడం కూడా ఓ కళ అని ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. దానికి ఓ టైమింగ్ ఉందని తెలుసుకోవచ్చు. రాంగ్ టైమ్‌లో వచ్చిన స్ఫూఫ్‌లు ప్రేక్షకుల్ని ఎంత విసిగిస్తాయి, ఎలా కసిరికొట్టేలా చేస్తాయి అనేది గమనించవచ్చు. దెయ్యాన్ని సంతృప్తిపర్చడం కోసం ‘జబర్దస్త్’ టైప్‌లో జబర్‌దోస్త్ అని ఓ ఎపిసోడ్ చేసినా, ఉప్పి-1, ఉప్పి-2, ఉప్పి-3 అని ప్రేక్షకుల్ని పిప్పిపిప్పి చేసినా, మాతృదేవోభవ సినిమా పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే లాంటి పాటలను కామెడీకి వాడుకున్నా అవన్నీ.. దర్శక నిర్మాతలకు మాత్రమే ఆనందాన్నిచ్చి ఉండొచ్చు. కేవలం తన బావ పోలికలు ఉన్నాయనే దెయ్యం హీరో వెంబడి పడిందని, అతనికి సహాయం చేసిందని చెప్పడం బాగానే ఉన్నా అసలు ఆమెకు ఏం కావాలి? అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే వదిలేశారు. ఇంత మంచి దెయ్యం ఉంటే కథా కథనాలు ఎలా సాగుతాయి? నటనాపరంగా ఎవరికి సరైన నటించే స్కోప్ దొరకలేదు. విజయ్‌సాయికి గతంలో ఉన్న ఛార్మింగ్ అంతా ఈ సినిమాలో జీరోలా కనిపించింది. నేహా దేశ్‌పాండే అలా నిలబడడానికే పనికొచ్చింది. మిగతా వాళ్లల్లో ఎవరి గురించి ఏం చెప్పుకునేదేం లేదు. కెమెరా పనితనం సోసోగా సాగితే జాన్ పోట్ల సంగీతంలో రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. ‘సరోవరం సుమాలై నాలో సొగసులే, నాలోని ప్రేమను నీలోను చూడని’ పాటలు పరవాలేదనిపిస్తాయి. అన్నిట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నేపథ్య సంగీతం. సన్నివేశాల్లో ఎంత డల్‌నెస్ కనిపించినా నేపథ్య సంగీతంతో అక్కడక్కడ పరిగెత్తించారు. భయపడేలా చేశారు. దర్శకత్వపరంగా స్క్రీన్‌ప్లేతోపాటు ఎక్కడా మెరుపులు చూపించలేకపోయారు.