రివ్యూ
ప్రేమ లేని.. పిపాసి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ప్రేమ పిపాసి
*
తారాగణం: జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్పుట్, మమత శ్రీ చౌదరి, అంకిత, సంజన చౌదరి, సుమన్, ఫన్‌బకెట్ భార్గవ్ తదితరులు
సంగీతం: ఆర్స్
సినిమాటోగ్రఫీ: తిరుమల రోడ్రిగ్జ్
ఎడిటర్: శివకిరణ్
నిర్మాత: పీఎస్ రామకృష్ణ
రచన, దర్శకత్వం: మురళి రామస్వామి
*
పొల్యూటెడ్ జనరేషన్స్‌లో స్వచ్ఛమైన ప్రేమను వెతుక్కునే హీరో కథ -ప్రేమ పిపాసి.
**
ఓ మంచి సినిమా చూపించడానికి స్పాన్‌వున్న పర్ఫెక్ట్ థ్రెడ్. కథ రాయడానికి ముందు -్థట్ ప్రాసెస్‌లో దర్శకుడూ అలానే అనుకునుంటాడు. కాకపోతే -కథా విస్తరణలో ‘యూనివర్శల్ యాక్సెప్టెన్సీ’ని గాలికొదిలేశాడు. తన ఆలోచనలే వాస్తవాలుగా భ్రమించాడు. తన అనుభవంలోని గ్రహింపులాగే -ప్రేమ ఉందనుకుంటూ ఫ్రేమ్ పెట్టేశాడు. హిట్టయిన అదో తరహా ప్రేమ కథల్లోని కంటెంట్‌నే ‘కమర్షియల్ చట్రం’లో బిగించాలనుకున్నాడు. అలా తయారు చేసుకున్న కథే -ఈ సినిమా. అప్డేట్ జనరేషన్స్‌లో స్వచ్ఛమైన ప్రేమ లేదన్న భావన -హీరోది. వెతికితే దొరుకుతుందన్న ఆశవుంటుంది. అలాంటి అమ్మాయి మనసు గెలవాలన్న తాపత్రయముంటుంది. అలాంటి కుర్రాడు ఏంచేశాడో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కాకపోతే -బలహీనమైన కథాకథనాలు, ఔచిత్యం లేని పాత్రలు, ఆసక్తి రేకెత్తించలేని సన్నివేశాలు రాసుకునే క్రమంలో ‘అసలు విషయాన్ని’ గాలికొదిలేశాడు.
తెలుగు తెరకి -ప్రేమ కథలు కొత్తకాదు. ప్రేమను పద్ధతిగా కొందరు చెప్పారు. పచ్చిగా ఇంకొందరు చూపించారు. ఎలా చెప్పినా, ఇంకెలా చూపించినా -ఆడియన్స్‌కి కరెక్ట్‌గా సారం అందించగలిగినోళ్లు హిట్లు కొట్టారు. లేనివాళ్లు -ప్లాపులందుకున్నారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేక -ప్రేమ పిపాసి దారితప్పేశాడు.
ఆత్మహత్యకు సిద్ధపడుతూ -తన పరిస్థితికి కారణం అమ్మాయన్న విషయాన్ని హీరో చెప్పడం నుంచి ఫ్లాష్బ్యాక్గా కథ మొదలవుతుంది. ఎలాంటి వ్యాపకాల్లేని కుర్రాడు బావ (జీపీఎస్). అయితే మత్తులో ఉంటాడు. లేదంటే అమ్మాయిలతో సెక్స్‌లో ఉంటాడు. వాడుకుని వదిలేయడానికి తన తెలివి ప్రయోగించే క్యారెక్టర్. అలా ఓ కోటీశ్వరుడు (సుమన్) కూతురు కీర్తిని వలలో వేసుకునే ప్రయత్నంలో బాగా తన్నులు తింటాడు. తన్నులు తింటూనే... అటుగా వస్తున్న బాలా (కపిలాక్షి మల్హోత్ర)కు లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఒకవైపు తన మనుషులు తంతుంటే, మరోవైపు ఇంకో అమ్మాయికి ‘ఐ లవ్ యు’ చెప్పడం చూసి సుమన్ షాకవుతాడు. బాల ప్రేమ కోసం ఆమె ఇంటిముందే తిష్టవేస్తాడు. ఆమరణ దీక్షలాంటి హీరో వ్యవహారం సుమన్ దృష్టికొస్తుంది. అతని ప్రేమలోని నిజాయితీ గ్రహించి, తను కూతురినే ఇవ్వడానికి సిద్ధపడతాడు. అల్లుడిని చేసుకుంటానని, యావదాస్తినీ ఇచ్చేస్తానని అంటాడు. హీరో ఏం చేశాడు? బాలా ఇంటిముందు తిష్ట వేయడానికి కారణాలేంటి? ఇలాంటి డౌట్స్ క్లారిఫై కావాలంటే -దర్శకుడు తెరకెక్కించిన సినిమా చూడక తప్పదు.
..పిపాసి కథ -ప్రేమకావ్యం కంటే కామకావ్యానికి చోటెక్కువ దక్కింది. సౌందర్యమైన భావనను సెక్సీగా చూపించే ప్రయత్నమే సాగింది. స్వచ్ఛమైన ప్రేమను వెతుక్కునే కథానాయకుడు -్ఫల్లుగా మందుకొట్టి కోరికలు తీర్చుకునే జులాయిగా కనిపించినపుడు పాత్ర ఔచిత్యం పూర్తిగా దెబ్బతింది. అమ్మాయిల్లో నిజమైన ప్రేమలేదనే నింద మోపుతూ, అందుకే కోరిక తీరగానే వదిలించుకుంటున్నట్టు తన స్నేహితుల వద్ద హీరో తన వ్యక్తిత్వాన్ని సమర్థించుకోవడం -ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. జేబులో కాండోమ్స్ ప్యాకెట్.. చేతిలో మందుబాటిల్‌తో -స్వచ్ఛమైన ప్రేమను వెతుక్కునే హీరో కాంట్రాస్ట్ క్యారెక్టర్ డిజైనింగ్ ఫ్యూచర్ సినిమాల్లో కూడా చూడమేమో. ఆడియన్స్ లక్ -ప్రేమ పిపాసిలో చూస్తారు. హీరో క్యారెక్టర్‌కు ఓ బేస్గాని, ఓ ప్రాసెస్గాని లేకుండా డిజైన్ చేయడం -ఆడియన్స్‌కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. స్వచ్ఛమైన అమ్మాయి ప్రేమను ఆశిస్తూ.. ఆమె ఇంటిముందే కూర్చుని ‘నువ్వూ తాగుదువుగాని రా’ అంటూ పిలిచే పిచ్చి హీరోయిజం తెలుగు సినిమాకు పరాకాష్ట.
హీరో హీరోయిన్ల పాత్రలకు కుటుంబ నేపథ్యం లేకుండా ‘మోడ్రన్ కంటెట్’ను డిజైన్ చేసి -ఎమోషన్స్‌కి ఏమాత్రం స్కోప్ లేకుండా చేయగలగడం దర్శకుడి అడ్వాన్స్డ్ థింకింగ్ అనుకోవాలి. కనిపించిన వాళ్లతో సెక్స్ చేస్తూ, ‘స్వచ్ఛమైన ప్రేమ’లా కనిపించిన అమ్మాయిని ఒప్పించడానికి పడే పాట్లే ప్రధాన కథాంశమైంది. చూపించాల్సిందంతా చూపించేసి -క్లైమాక్స్‌లో ఉదాత్త సందేశమిచ్చే థర్డ్ రేటెడ్ మూవీ ఫార్మాట్‌ను అనుసరించాడు దర్శకుడు. కక్కుర్తి లిప్‌లాక్‌లు, కమర్షియల్ రొమాన్స్ సీన్లన్నీ వేసేసి -సందేశాత్మకంగా ఫ్లాష్‌బ్యాక్‌తో బ్యాలెన్స్ చేయాలనుకోవడం పూర్తిగా వికటించింది. ఆ ఫ్లాష్బ్యాక్లోనూ సరుకు లేక, అల్లుకున్న కామెడీ పేలక.. ప్రేమ పిపాసి టైటిల్‌కే ద్రోహం చేశాడన్న భావన కలుగుతుంది.
హీరో రోల్ చేసిన జీపీఎస్ -ఏమాత్రం హీరో మెటీరియల్ అనిపించలేదు. అతని క్యారెక్టరైజేషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోవడం -జీపీఎస్ కెరీర్‌కూ ఇబ్బందికరమే. హీరోయిన్, ఇతర నాయికల పాత్రధారులు కమర్షియల్ కంటెంట్ వడ్డించారేగానీ, పెర్ఫార్మెన్స్ లెవల్‌కు రాలేదు. కోటీశ్వరుడిగా బేస్ లెస్ క్యారెక్టర్లో సుమన్‌ని యాక్సెప్ట్ చేయలేం.
‘ప్రియతమా ప్రియతమా’ అన్న బాణీ తప్ప, ఆర్స్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయలేం. బలహీన కథ, బరువు తక్కువ సీన్స్‌కు తగిన మ్యూజిక్ ఇచ్చాడనే అనుకోవాలి. తిరుమల కెమెరా పనితనం సోసో. మిగిలిన టెక్నీషియన్ల గురించి మాట్లాడుకునేంత సబ్జెక్టు సినిమాలో కనిపించదు. నిర్మాణ విలువలూ అంతంతమాత్రం.