రాష్ట్రీయం

రోజా సస్పెన్షన్‌పై 20 రోజుల్లో నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిక్షా కాలాన్ని పెంచే యోచన
హైదరాబాద్, జనవరి 2: వైకాపా ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేసిన అంశం వివాదాస్పదం కావడంతో, దాన్ని పరిశీలించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియమించిన కమిటీ శనివారం సమావేశమైంది. కమిటీకి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు. కమిటీలో తెదేపా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించి 20 రోజుల్లో సభాపతికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22న సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై స్పీకర్ ఈ కమిటీని నియమించారు. సభా కార్యక్రమాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో కూడా కమిటీ చర్చించింది. సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలించనుంది. ఇకమీదట సభాకార్యకలాపాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచించనుంది.