క్రైమ్/లీగల్

మహిళను కత్తులతో బెదిరించి లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4: మహిళను కత్తితో బెదిరించి ఇల్లు లూటీ చేశారు. ముసుగులు ధరించి ఇంట్లో చొరబడ్డ ఇద్దరు దుండగులు 20 తులాల బంగారు నగలు, రూ.10 వేలు దోచుకెళ్ళారు. ఈ చోరీ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హఫీజ్‌పేట ఫ్లై ఓవర్ వద్దగల ఆదిత్య హైట్స్‌లోని ఏ బ్లాకులోగల ఫ్లాట్ నెంబర్ 403లో ఉంటున్న సయ్యద్ మహ్మద్ కొండాపూర్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం ఇంటికి రాకుండా అందులోనే పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బెల్ కొట్టడంతో భర్త వచ్చాడని భావించి ఇల్లాలు తలుపు తెరిచింది. హఠాత్తుగా ఇంట్లో చొరబడ్డ ఇద్దరు దుండగులు యజమానురాలు కౌసర్ మీర్జా (27)ను కత్తితో బెదిరించి ఒంటిపై ఉన్న నగలతోపాటు ఇంట్లో ఉన్న మొత్తం 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు దోచుకుని ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ క్లూస్ టీం పోలీసుల బృందాన్ని పిలిపించి దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ ఇన్‌స్పెక్టర్ చీమర్ల హరిశ్చంద్రారెడ్డి కేసు నమోదు చేయగా అదనపు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.