రాష్ట్రీయం

గవర్నర్‌కు ఆర్టీసీ జెఎండి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ జి.వి.రమణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జెఎండితో పాటు జాయింట్ విజిలెన్స్ డైరక్టర్ వెంకట్రావు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జిఆర్ కిరణ్‌లు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం సిఎం కెసిఆర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసి జెఎండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని టిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది.