Others

సిరిమల్లె నీవె.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయకుడు తన మనస్సులో రేగిన భావుకతతో కథానాయికను చూస్తూ అందంగా ఆలపించే పాట. సినిమల్లె నీవె.. విరిజల్లు తావె. 1978లో వచ్చిన ‘పంతులమ్మ’ చిత్రంలో రంగనాథ్, లక్ష్మి, దీప ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికీ ఆణిముత్యాలే. కన్నడ కస్తూరి, తెనుగు తేనె తేట అన్నట్లుగా బాణీలు మాత్రమే కన్నడ భాషవి, తెలుగు కన్నడ సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర లాంటి వాళ్లు అద్భుతమైన బాణీలను అందించారు.
పంతులమ్మ చిత్రంలో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటను ఎస్.పి.బాలు అదే రీతిలో అందంగా ఆలపించారు. ఈ పాట ఆరోహణ, అవరోహణలతో రక్తికట్టించారు. రేడియో శ్రోతలు ఈ పాటను తరచూ వినిపించమని కోరడంతో ఈ పాట మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మధ్యమధ్యలో ఆ.. అనే ఆలాపనతో ఆ పాటలో వున్న తియ్యదనాన్ని చెవులూరించేలా బాలు గానం చేశారు. ఎలమావి తోట, మధుమాసం, తలపులన్నీ నావె, వలపులన్నీ నీవె లాంటి అందమైన మాటలతో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చుట్టూ వున్న ప్రకృతిని కథానాయికకు ఉదాహరణగా చేస్తూ ఆలపించిన ఈ పాట ఇప్పటి తరానికి అర్ధమవుతుందా?

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, బందరు