ఆంధ్రప్రదేశ్‌

సమస్యలు తీర్చండి..బాబూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి కార్యాలయానికి సోమవారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను తెలియజేసి సహాయం పొందటానికి బారులుతీరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సమస్యలను సావధానంగా విని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి 18 సంవత్సరాల యువకుడు సిహెచ్ నవీన్ వచ్చి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు. వైద్యచికిత్సకు తల్లిదండ్రులు ఆస్తిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. అతని వైద్యానికి అయ్యే వ్యయం రూ.2లక్షలను మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఉంటున్న గుంజలి ఇజ్రాయెల్ ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. కర్నూలు జిల్లా సుండిపెంట వాసి ఆర్ బాలచంద్ర అనారోగ్యంతో ఉన్నాడు. కూలి పనిచేసే అతను శారీరక శ్రమ చేయలేని స్థితిలో ఉన్నాడు. వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లిలో ఉండే కె సుమలత భర్త నిరాదరణకు గురైంది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను పోషించే భారం పడింది. వీరందరికీ ఆయన రూ.20వేల చొప్పున మంజూరు చేశారు. విద్యాధరపురం రామరాజ్యనగర్ వాసి తమిడిపాటి శ్రీనివాసరావు పేదరికంలో ఉన్నాడు. అమ్మాయి పెళ్లికి సహాయం కోరగా ముఖ్యమంత్రి రూ.20వేల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం పెర్లపాడులో ఉంటున్న నాగులపాటి సుబ్బులు అనారోగ్యంతో ఉంది. నెలకు రూ.3వేలు తన వైద్యానికే ఖర్చవుతున్నాయి. భర్త కూలిపని చేసే స్థితిలో లేడు. విజయవాడలో నివసిస్తున్న కె సుగుణకుమారి పేదరికంలో మగ్గుతోంది. వీరందరికీ రూ.20వేల చొప్పున మంజూరు చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న జి విజయకుమారి తన భర్త, కుమార్తెతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు జిల్లా వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. విజయకుమారికి రూ.25వేలు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీరాల 25వ వార్డులో గ్రావెల్ రోడ్డు, ర్యాంపులు, సిసిరోడ్ల నిర్మాణం చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించాలని కౌన్సిలర్ ఈసర్ల సుజాత సిఎంను కోరారు. చీరాల, వైకుంఠపురం ఫైర్‌స్టేషన్ దగ్గర రైల్వేట్రాక్ పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. చంద్రగిరి మండలం పుల్లయ్యగదరి పల్లిలో ఉంటున్న కొమ్మినేని గురవయ్య నాయుడు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం న్యూ జూపూడిలో నివసిస్తున్న సిహెచ్ లక్ష్మణస్వామి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు.