ఆంధ్రప్రదేశ్‌

రూ.30కోట్ల స్థలం ‘దేశం’ ధారాదత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 15: ‘వడ్డించేవాడు మన వాడైతే...’ అనే సామెతను నిజం చేస్తూ కోట్లాదిరూపాయల విలువచేసే స్థలాన్ని కారుచౌకగా తమ పార్టీ కార్యాలయానికి అప్పనంగా కేటాయించింది టిడిపి ప్రభుత్వం. కడప పాత మున్సిపల్ కార్యాలయం, ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న పాత రిమ్స్ స్థలం వెరసి ఎకరాన్నర స్థలాన్ని టిడిపి కార్యాలయ నిర్మాణ నిమిత్తం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం కేటాయించింది. 1932లో సర్వే నెం.295 1ఎ, 1బి, ఎ2లకు చెందిన ఈ స్థలంలో మున్సిపల్ కార్యాలయం ఉండేది. స్థల కేటాయింపుపై వైకాపా, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధంతోపాటు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి స్వయంగా రంగప్రవేశం చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వైకాపా ఆధీనంలో నగర పాలక సంస్థ ఉండటంతో మేయర్ కె.సురేష్‌బాబు, వైకాపా కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషలు సోమవారం విలేకర్ల సమావేశంలో తారాస్థాయిలో విమర్శలకు దిగారు. గత ఏడాది జులై 27వతేదీన తమ కార్యాలయానికి స్థలం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) దరఖాస్తు చేయగా, ప్రభుత్వం కనీసం ఆ స్థల యాజమాన్యమైన కార్పొరేషన్‌ను సంప్రదించలేదు. అత్యంత గోప్యంగా కార్యదర్శి స్థాయిలో అనుమతి ఇచ్చేసి ఎకరా ధర 9.65లక్షలుగా నిర్ణయించారు. పార్టీ కార్యాలయానికి మొత్తం 1.5ఎకరాలకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడం, కేబినెట్ ఆమోదం జరిగిపోయాయి. నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో టిడిపి కార్యాలయానికి ఇచ్చిన ధరకు మార్కెట్‌లో అర్థసెంటు కూడా దక్కే పరిస్థితి లేదు. అటువంటి ఏకంగా ఎకరాన్నర స్థలాన్ని కారుచౌకగా టిడిపి కార్యాలయానికి కట్టబెట్టేశారు. అంతా చక్కబెట్టుకున్నాక తాజాగా ఫలానా స్థలంలో తాము కార్యాలయం కట్టడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు నగర పాలక సంస్థకు దరఖాస్తు చేయడంతో మేయర్‌తోపాటు పాలకవర్గ సభ్యులు నివ్వెరపోయారు. నగరపాలక సంస్థకు తెలియకుండా, పాలకవర్గ తీర్మానం లేకుండా తమ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయించారంటూ మేయర్ సురేష్‌బాబు సోమవారం తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.