రాష్ట్రీయం

‘సిమి’ ఉగ్రవాదుల విచారణకు పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఒడిశాలో నక్కిన నలుగురు కరడు గట్టిన సిమి ఉగ్రవాదులను తెలంగాణ పోలీసులు సాహసంతో పట్టుకుంటే, వారిని విచారించేందుకు దేశంలోని అరడజను రాష్ట్రాల పోలీసులు క్యూ కట్టారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు పోలీసులు ఒడిశాకు వెళ్లి తమకు ఇంటరాగేషన్ నిమిత్తం అప్పగించాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో నలుగురు నిందితులు షేక్ మహబూబ్, అంజాద్ ఖాన్, జాకీర్ హుస్సేన్, మహమ్మద్ సాలిక్‌పై కేసులు నమోదై ఉన్నాయి. నల్లగొండ జానకీపురంలో ఎన్‌కౌంటర్‌లో హతమైన మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఎజాద్దీన్‌లతో కలిసి నలుగురు ఉగ్రవాదులు సంగారెడ్డిలోని ఒక ఇంట్లో తలదాచుకున్నారా లేదా అనే విషయంపై దర్యాప్తులో వెల్లడి కానుంది. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే నలుగురు సిమి ఉగ్రవాదులు రాంచి, చెన్నై, కోల్‌కొత్తా, జెంషెడ్‌పూర్ ఇతర ప్రదేశాలకు వెళ్లి కొన్నిరోజులు బస చేసినట్లు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఈ నలుగురు అంతకుముందు ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరితో కలిసి హైదరాబాద్ శివార్లలో సురక్షితమైన ప్రదేశం కూడా ఆనే్వషించినట్లు సమాచారం. చొప్పదండి బ్యాంకులో రూ.42 లక్షల నగదును చోరీ చేయడమే కాకుండా, రామచంద్రపురం ముత్తూట్ ఫైనాన్స్‌లో జరిగిన చోరీతో వీరికి సంబంధం ఉందనే విషయమై కూడా విచారణలో వెల్లడి కానుంది.