సర్దార్‌లో రాణిలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో నుంచి వచ్చిన సంజన ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ ఆమెకు ఏమాత్రం కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఇక తన పని అయిపోయిందని అనుకున్న సమయంలో పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్‌లో సంజనకు అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో అచ్చమైన తెలుగమ్మాయిగా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు కట్టుకుని మరీ కనబడుతుందట. ఈ విషయాన్ని ఆమె చెబుతూ ఈ సినిమా మొత్తం తానొక రాణిలా కనబడతానని, తన కెరీర్‌లోనే ఈ పాత్ర విభిన్నమైనదని చెబుతోంది. తానెప్పటినుంచో ఎదురుచూస్తున్న పవన్‌కళ్యాణ్‌తో నటించడం చాలా సంతోషంగా వుందని, ఈ చిత్రంతో తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది సంజన.