ఆంధ్రప్రదేశ్‌

సిఐడి కస్టడీకి అగ్రిగోల్డ్ డైరెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 5: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను విచారణ నిమిత్తం సిఐడి కస్టడీకి ఇస్తూ ఏలూరులోని జిల్లా కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని పెదపాడు పోలీసుస్టేషన్‌లో ఈ సంస్థపై కేసు నమోదు కావడం తెలిసిందే. అగ్రిగోల్డ్ సంస్థలో కీలక వ్యక్తులుగా భావిస్తున్న ఇద్దరు డైరెక్టర్లు సవడాం శ్రీనివాసరావు, దంపా రామమోహనరావును సిఐడి అధికారులు ఈ నెల 1వ తేదీన విజయవాడలో అరెస్టుచేశారు. అనంతరం వారిని ఏలూరు తీసుకువచ్చి జిల్లా కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఏలూరులోని జిల్లా కోర్టుకు తరలించారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకమైన వ్యక్తులుగా సిఐడి అధికారులు భావిస్తున్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ఏర్పాటైన నాటినుంచి వారు అందులోనే కొనసాగుతున్నారు. వీరికి ప్రజా సంబంధాలు, రాజకీయ, ఇతర సంబంధాలు ఉండడంతో సంస్థను ముందుకు నడవడంలో వీరు కీలకపాత్ర పోషించినట్లు సిఐడి అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనితో వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టడానికి వారిని కస్టడీకి తీసుకోవాలని భావించారు. ఈమేరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశారు. దీనితో వారిని అయిదు రోజులపాటు పూర్తిస్థాయిలో విచారించడానికి సిఐడి కస్టడీకి ఇస్తూ బుధవారం ఏలూరులోని జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది. సిఐడి అదనపు ఎస్‌పి హరికృష్ణ, ఎస్సైలు రమణ, పైడిబాబు, రవిబాబు బుధవారం ఏలూరు చేరుకుని టౌన్ సి ఐ బంగార్రాజు, టుటౌన్ ఎస్సై గంగాధర్ సహకారంతో శ్రీనివాసరావు, రామ్మోహనరావును కస్టడీలోకి తీసుకుని, విజయవాడలోని సిఐడి ఎస్‌పి కార్యాలయానికి తరలించారు.

విచారణ అనంతరం ఈ నెల 9వ తేదీ సాయంత్రం గానీ, 10వ తేదీ ఉదయం గానీ వారిని తిరిగి ఏలూరులోని జిల్లా జైలుకు తరలించనున్నారు.