ఆంధ్రప్రదేశ్‌

8నుంచి దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో ఏడో రోజుకు చేరుకుంది. సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లోనే కొనసాగుతున్న సమ్మె ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంస్ సమ్మెను చేపట్టనుంది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా మార్కెట్ యార్డులు బోసి పోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుండగా పండ్లు, కూరగాయల మార్కెట్లు మూతపడుతున్నాయి. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్ యార్డులు బోసిపోతుండడంతో యార్డుల్లో పనిచేస్తున్న వేల మంది హమాలీలు పనిలేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని బెంబేలెత్తుతున్నారు. చిరువ్యాపారులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయి. రిటైల్ వ్యాపారులు వస్తువులపై కనీస ధరల కంటే 25 శాతం ధరలు పెంచారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఐఆర్‌డిఏ)తో చర్చలు విఫలమైన నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో లారీల సమ్మె మరింత తీవ్రమైంది.
కెటిఆర్ వ్యాఖ్యలను
స్వాగతిస్తున్నాం
ముందు గబ్బు మంత్రులను బర్తరఫ్ చేయాలి
టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5: దళారులు, లంచగొండులను చెప్పులతో కొట్టండి అంటూ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని, అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరు దళారులో, లంచాలు తీసుకునేవారు ఎవరో అందరికీ తెలుసని టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్దండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. నువ్వు, మీ అయ్యా, మీ బావ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో, ప్రాజెక్టులలో కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటున్న కమీషన్లపై ఏ విధంగా కొట్టాలని ఆయన ప్రశ్నించారు. ముందుగా కెటిఆర్ చేస్తున్న అవినీతిని బంద్ చేసుకున్న తర్వాత ఇతరులకు చెబితే బాగుంటుందని హితవు పలికారు. ముఖ్యంగా కాంగ్రెస్ గబ్బును తొలగిస్తానంటున్న ఆయన తన మంత్రి వర్గం లో ఉన్న గబ్బు మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశా రు. అప్పుడు మంత్రి కెటిఆర్ నిజాయితీపరుడని, టిఆర్‌ఎస్‌ది బ్రోకర్ల రాజ్యం కాదని ప్రజలు అప్పుడు నమ్ముతారని అన్నారు.

గాంధీ తత్వమే మార్గదర్శకం
గీతం వర్శిటీ విసి శివప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 5: విద్యార్థులు జ్ఞానాన్ని ప్రసాదించడానికే ఉపాధ్యాయుల పాత్ర పరిమితం కారాదని, విద్యార్ధులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది అన్ని వర్గాల అభ్యున్నతికి కృష చేయాల్సి ఉంటుందని గీతం విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎం ఎస్ శివప్రసాద్ పేర్కొన్నారు. గీతం వర్శిటీ హైదరాబాద్ క్యాంపస్ ఘనంగా నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ విద్యా వ్యవస్థ వ్యక్తి శీలాన్ని పెంపొందిస్తుందని, తాము కోర్సుల రూపకల్పనలో జాతిపిత గాంధీజీ ఆలోచనా విధానాన్ని, తత్వాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటామని అన్నారు. మానవత్వం లేని శాస్త్రం వృథా అని, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత అందరిదీ అని అన్నారు. విద్య, అనుబంధ అంశాలతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు.