సబ్ ఫీచర్

స్వచ్ఛ్భారత్ కోసం ప్రాణాలు వదిలాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర ఢిల్లీ నగరంలో జిబిటి నగర్‌లో రవీంద్రకుమార్ తన ఆటో పెట్టుకుంటాడు (32). ఈ ఆటో డ్రైవర్ స్వచ్ఛ్భారత్ ప్రియుడు. అక్కడ, ఎవరయినా నెంబర్ వన్ కాని నెంబర్ టు కాని చేశారో- వాళ్ళని అడ్డుకుంటాడు, లెక్చర్ ఇస్తాడు- హితవాక్యాలు చెప్పి ‘‘అంతగా పైసలు లేకపోతే నేనే రెండు రూపాయలిస్తా- అదుగో.. పో అక్కడ ప్రజా పాయిఖానా- పబ్లిక్ టాయిలెట్స్ వున్నాయి- రుసుము చెల్లించు వాడుకో-’’ అని వారిస్తాడు. మొన్న శనివారం ఇద్దరు రౌడీ బాపతు ముష్కర యువకులిద్దరు మనవాడి ఆటో పార్కింగ్ దగ్గరలో గోడని మూత్రవిసర్జనకి వాడేసుకుంటున్నారు. మండిపోయింది రవీంద్ర కుమార్‌కి- ఆగండయ్యా! ఆగండి, అదో దగ్గరలోనే పబ్లిక్ మరుగుదొడ్లున్నాయి- పోండి అన్నాడు కొంచెం కోపంగానే- ‘‘కావాలంటే నేను రెండు రూపాయలిస్తా, అక్కడ చెల్లించి పని పూర్తిచేసుకోండి’’ అని చెప్పాడు. ‘‘క్యావ్రే? క్యా సమ్‌ఝా రఖారే.. హమ్కో’’ (ఏమనుకున్నావురా మమ్మల్ని)- అంటూ వాళ్ళు రవీంద్ర కుమార్ని రాళ్ళను తువ్వాలులో చుట్టి పిడికిలికి తువాళ్ళు చుట్టి అదేపనిగా అతన్ని కొట్టి పోయారు. ఆటోవాలా ప్రాణాలు ఆ దెబ్బలకి తట్టుకోలేక పైకి ఎగిరిపోయాయి. ఈ యువకుడికి పోయినేడాదే వివాహమైంది. భార్య ఇప్పుడు గర్భవతి. అశోక్ మార్కెట్ దగ్గరలోనే ముగ్గురు అన్నదమ్ములున్నారు.. కానీ శుచి శుభ్రతలకి బలి అయిపోయాడు.. అందుకే చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అంటారు.