ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి ఎన్నికలు సరళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టం-1997 చట్టంలో భారీ మార్పులు చేస్తూ మంత్రిమండలి తీర్మానించింది. సాగునీటి సంఘాల కాలపరిమితిని ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. క్లిష్టతరంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసింది. చేతులు ఎత్తి ఆమోదం తెలిపే విధానం ప్రవేశపెట్టే సవరణకు ఆమోదం తెలిపింది. వివాదంగా మారిన పాఠశాలల హేతుబద్ధీకరణపై తొందరపడబోమనీ అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే క్యాబినెట్‌లో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో 25 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యాంశాలు
* క్లిష్టతరంగా ఉన్న సాగునీటి ఎన్నికల ప్రక్రియ సరళీకృతం. చేతులు ఎత్తి ఆమోదం తెలియజేసే విధానం ప్రవేశపెట్టే సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం చిన్నతరహా జలవనరుల నీటి సంఘం పరిధిలో 6 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి సంఘాల పరిధిలో 12 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. నీటి సంఘం పరిపాలనా సౌలభ్యం కోసం వీటి కనీస సంఖ్య 6గా, గరిష్ఠ సంఖ్యను 12గా నిర్ణయిస్తూ మంత్రిమండలి తీర్మానించింది. ఇప్పుడు దాన్ని స్థిర విధానంతో ఐదేళ్ల కాలపరిమితి ఉండేలా మర్పులు చేశారు.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిపుణుల కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ఈ మార్పులు చేశారు.
* పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనుకూలంగా ఉండేలా గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను పిపిపి విధానంలో నెలకొల్పేందుకు ఏపిజిఐసి పాలసీ, 2017-2020ని తీసుకువచ్చారు. కొత్త పాలసీ ప్రకారం వౌలిక సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడా అవగాహన కుదురుతుంది.
* 2020 నాటికి రూ.2,500 కోట్ల పైచిలుకు పెట్టుబడులు, 50వేలకు మించి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందింది.
* రూ.1683 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు జూన్ 4వ తేదీనాడు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశం. దీని ద్వారా 13 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.
* ఉద్యాన రంగం, ఇతర రంగాల్లో ఇంకా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయేమో చూసి క్లియర్ చేయాలని ఆర్థికశాఖను సిఎం ఆదేశించారు.
* ఇన్స్యూరెన్స్ కింద రూ.595 కోట్లు వస్తుంది.
* ఏపి రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014లోని షెడ్యూల్ 9 కింద ఉన్న 9 బిసి ఫెడరేషన్లకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు, అప్పుల పంపకాలపై డాక్టర్ షీలాభిడే కమిటీ చేసిన సిఫార్స్‌లను ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
* 9.2.2017న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు జరిపిన సమావేశంలో షీలాభిడే కమిటీ ఈ సిఫార్సులను అందించింది. చరాస్తులు, పీడీ అకౌంట్, బ్యాంకు బ్యాలెన్స్‌లు 58.32 శాతం, 41.68 శాతం నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య పంపకాలు జరుగుతాయి.
* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ మంత్రిమండలి తీర్మానం
* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు అవసరమైన ఏపి అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 3, 2006లో సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం.
* ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగానికి హడ్కో నుంచి 2 వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు నిరుడు డిసెంబర్ 26న ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ జీవో విడుదలైంది. అయితే హడ్కో కంటే తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మూడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి నిర్ణయిస్తూ ఈ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకరిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
* రానున్న కాలంలో నిధుల సమీకరణకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.
* రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఫుడ్ పార్క్‌లు అనే పదాన్ని చట్టంలో చేరుస్తూ మార్పు చేసింది.
* అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు రూ.1859 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు రుణ పరిమితి పెంచుతూ మంత్రిమండలి ఆమోదం.
* విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామంలోని 3ఎకరాల భూమిని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌కు కేటాయింపు.
* విశాఖ జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 2,884.66 ఎకరాల భూమిని ఏపిఐఐసికి అప్పగిస్తూ మంత్రిమండలి తీర్మానం. ఇక్కడ భాభా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్, సెజ్ ఏర్పాటు చేయనున్నారు.
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 144 ఎకరాల భూమిని ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ మంత్రిమండలి తీర్మానం. దీనికి ఉచితంగా అందిస్తారు. ఈ ప్రాంతంలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు.
చిత్రం: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగుతున్న దృశ్యం