షుగర్ ఫ్యాక్టరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల చివరివరకూ జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తికానుంది. ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లితో తన 25వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ మరో సినిమాకు కమిట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది అర్జున్‌రెడ్డి సినిమా టాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ వంగ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మహేష్‌కి కథ చెప్పాడని తెలిసింది. వంశీ పైడిపల్లి సినిమా తరువాత మహేష్ చేసే చిత్రం ఇదేనని వార్తలు వస్తున్నాయి. అర్జున్‌రెడ్డిలాంటి మాస్‌మసాలా చిత్రాన్ని తీసిన ఈ దర్శకుడు మహేష్ కోసం మరో ఆసక్తికర టైటిల్‌ను పెడుతున్నట్టు తెలిసింది. ఇంతకూ ఆ టైటిల్ ఏమిటో తెలుసా? షుగర్ ఫ్యాక్టరీ! వినడానికే ఆశ్చర్యంగా వున్న ఈ టైటిల్‌తోనే ఈ సినిమా తెరకెక్కనున్నదట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.