AADIVAVRAM - Others

పరిపూర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ఏదైనా పని చేస్తే అందులో పరిపూర్ణత వుండాలని కోరుకుంటారు.
అలాంటి ఆలోచన మంచిదే. కాని పరిపూర్ణత కోసం చూస్తూ అసలు పని చేయకపోతేనే బాధ.
నేను కూడా చాలా విషయాల్లో పరిపూర్ణత వుండాలని అనుకుంటాను. ఈ విషయం గురించి ఓ సంఘటన చెబుతాను.
ఆ మధ్య నేను ‘వేములవాడ కతలు’ అని కొన్ని కథలు రాశాను. పత్రికల్లో అవి ప్రచురితమయ్యాయి. పుస్తకం మూడు ప్రచురణలు పొందింది.
ఆ కథలు మొదలు పెట్టిన కొత్తలో అవి పరిపూర్ణతగా ఉండాలని మనస్సులో మొత్తం ఊహించుకొని రాయడానికి ప్రయత్నం చేశాను. అయితే అలా ఊహించుకోవడంలోనే కాలం గడిచింది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకునేవాడిని.
కొద్ది రోజులకి ఆ విషయాన్ని గమనించి, ఆ తరువాత ఆ పద్ధతిని మార్చుకున్నాను. కథను రాయడం మొదలు పెట్టాను. సంభాషణలో కథాగమనం సాఫీగా కొనసాగింది. ఆ విధంగా 25 కథలు పూర్తి చేశాను.
పరిపూర్ణత కావాలని ఆలోచిస్తూ, మొత్తం సంభాషణలని ఊహిస్తూ, ఆలోచిస్తూ కూర్చుంటే అవి రాయకపోయేవాణ్ని.
పరిపూర్ణత లేకపోయినా ఫర్వాలేదని భావించడం వల్ల కథలలు పూర్తయ్యాయి. నిజానికి కథల్లో పరిపూర్ణత వచ్చింది.
కథని రాస్తూ పోతే పరిపూర్ణత అదే వస్తుందని రుజువైంది.
ఆ విషయం ఒక్క కథల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది.
* * *
చాలామంది మంచి ప్రణాళికతో ముందడుగు వేయాలని కాంక్షిస్తారు. ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఓ గొప్ప పరిపూర్ణ ప్రణాళిక కన్నా పరిపూర్ణత లేని చర్యతో ఎంతో ముందుకు పోవచ్చు.
చాలా మందికి మనస్సులో ఎన్నో ఆలోచనలు వుంటాయి. వాటిని గొప్పగా ప్రెజెంట్ చేయాలని ఆలోచిస్తూ చేయాల్సిన పని చేయరు.
పరిపూర్ణత లేకపోయినా ఫర్వాలేదు. ఈ అపరిపూర్ణతని ఆలింగనం చేసుకోండి.
అది మిమ్మల్ని పరిపూర్ణత వైపు ప్రయాణం చేయిస్తుంది.

- జింబో 94404 83001