ఐతే.. ఆకట్టుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రనీల్ సేన్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయ రామారావు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి, దర్శకురాలు నందినీరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందినీరెడ్డి మాట్లాడుతూ- ఈ మధ్యకాలంలో రెగ్యులర్ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్ వైపు కూడా చూడటంలేదు. తెలుగు ఆడియెన్స్‌లో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. రాజ్‌మాదిరాజ్ అమేజింగ్ కథ రాశారు. ఆయన రచనా శైలి అంటే నాకు ఇష్టం. ఇది మంచి సినిమా అవుతుంది అన్నారు. దర్శకుడు రాజ్ మాదిరాజ్ మాట్లాడుతూ- ఇంజనీరింగ్ పూర్తిచేసి నిరుద్యోగంతో వున్న నలుగురు యువకులు ఆకలికి, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు? అన్న పాయింట్‌కు నేటి టెక్నాలజీ, సోషల్ మీడియా, హ్యాకింగ్ వంటి అంశాలను కీలంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం ఇంటర్‌నెట్ వలలో ఇరుక్కుపోయిన జనాలకు ఈ సినిమా ద్వారా చక్కని సందేశం ఇస్తూ ఓ హెచ్చరిక కూడా ఇస్తున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ యథార్థ సంఘటనల ఆధారంగా తెరక్కెన ఈ చిత్రం చక్కని వినోదాన్ని కూడా పంచుతుంది. ఈ సినిమాల్లో నిజాల్ని చెప్పబోతున్నాం అన్నారు. హిందీలో కూడా సినిమాను విడుదల చేయబోతున్నాం. త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేసి మార్చి 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, ఎడిటింగ్: కార్తీక్ పల్లె, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్ చిలువేరు, నిర్మాతలు: కె.విజయ రామరాజు, డా.హేమంత్ వల్లపురెడ్డి, దర్శకత్వం: రాజ్ మాదిరాజ్.