ఆంధ్రప్రదేశ్‌

చెరువులో శవాల కుప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 18: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఆదివారం ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులంతా పురుషులే కావడం గమనార్హం. వీరి ఒంటిపై లుంగీలు, చొక్కాలే ఉన్నాయి. సాయంత్రం వరకు మృతదేహాల కోసం ఎవరూ రాలేదు. వీరంతా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలా? లేక వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. కడప -చెన్నై జాతీయ రహదారిలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఆదివారం 11 గంటల ప్రాంతంలో ఐదు పురుషుల మృతదేహాలు బయటపడ్డాయి. చెరువుకు ఆనుకుని ఉన్న గుంతలో ఐదు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కడప ఓఎస్డీ నవీన్, రాజంపేట డిఎస్పీ లక్ష్మీనారాయణ సిబ్బందితో సంఘటానా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలూ లేవు. ఎవరైనా వీరిని కొట్టి చంపి చెరువులో పడేశారా? లేక మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువుకు కొద్ది దూరంలో వీరికి సంబంధించిన లగేజీ సంచులు, పాదరక్షలు కనిపించాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓఎస్డీ నవీన్ మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. మృతులు ఎవరు? ఎక్కడివాళ్లు? ఎవరైనా వీరిని కొట్టి చంపి చెరువులో పడేశారా? లేక వీరే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
chitram...
కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో లభించిన మృతదేహాలు