Others

రవిబాబు దర్శకత్వంలో.. (‘టాలీ’ టాక్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్ నటించిన ‘రంగుల రాట్నం’ సినిమా ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం రాజ్‌తరుణ్ ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘రాజుగాడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవిబాబుతో రాజ్‌తరుణ్ సినిమా ఉండబోతోందని తెలిసింది. స్వప్నదత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. రవిబాబు ప్రస్తుతం ‘అదుగో’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత రవిబాబు-రాజ్‌తరుణ్ సినిమా మొదలు కాబోతోందని సమాచారం. ఈ సినిమాతోపాటు రాజ్‌తరుణ్ మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్ ఆర్.రావ్