Others

కెరీర్‌పైనే మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14 ఏళ్ల క్రితం సీనియర్ హీరోలకు జోడీగా పరిచయమైన నయనతార ఇప్పుడు యువ హీరోల కథానాయకగా మెప్పిస్తుండటం విశేషం. ఆరంభంలో రెండో నాయక, ప్రత్యేక గీతాల్లో చిందులేసే పాత్రలు పోషించినప్పటికీ.. నటనను మాత్రమే నమ్ముకున్న నయన్.. చిత్రపరిశ్రమలో సీనియర్ అయ్యేకొద్దీ అవకాశాలను పెంచుకుంటున్నారు. బాలకృష్ణ, ఎన్‌టిఆర్, వెంకటేష్, రానా..ఇలా బాబాయ్, అబ్బాయలతో జోడీ కడుతూ అందర్నీ ఆశ్చర్యపరస్తున్నారు.

అందాల నటి నయనతార ఇక కెరీర్‌పైనే మోజు పెంచుకుంటోంది. ఇన్నాళ్లు ప్రేమా, దోమా అంటూ తెగ ఇబ్బందులకు గురైన ఈ బ్యూటీ ఇకపై అలాంటి విషయాలకు జోలికి వెళ్లకుండా తన స్టామినా ఏంటో మరోమారు నిరూపించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఇకపై హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు అని కూడా గట్టిగానే చెబుతోంది. ఈ భామ మొదట్లో నటిగా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఇమేజ్‌ను కాపాడుకోవడానికి తెగ తాపత్రాయ పడుతోంది. మొదట్లో దర్శకుల సూచనలతో నటించేది. అందాల ఆరబోత విషయంలో హద్దుల పరిధి విధించుకోలేదు. టూపీస్ దుస్తుల నటనకు పరాకాష్ట ‘బిల్లా’ సినిమా. అయితే అదంతా గతం.. నటిగా ఒకప్పటి స్థాయి వేరు, ఇప్పటి నయన స్థానం వేరు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలెట్టారో.. అప్పటి నుంచి అభిమాను లు ఈ బ్యూటీకి లేడీ సూపర్‌స్టార్ పట్టం కట్టేశారు. ‘అరమ్’ చిత్రంతో నయనతార లెవల్ వేరు అన్నంతగా మారిపోయింది. ఇకపై నాతో నటించాలంటే నిబంధనలు వర్తిస్తాయంటోందిట. మొదట్లో దర్శకులు చెప్పినట్లు నయనతార నటించేవారు. ఇప్పుడు ఆమె ఆదేశాలను దర్శక నిర్మాతలు పాటించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని గ్రహించిన నయనతార ఇకపై ‘నిబంధనలు వర్తిసాయి’ అని అంటోందిట. ముఖ్యంగా ‘ఇంతకు ముందు మాదిరి హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు. ఇక ఒక పరిమితికి మించి కురుచదుస్తులు ధరించను’ అని దర్శక నిర్మాతలకు కథ వినిపించినప్పుడే స్పష్టంగా చెబుతోందిట. తాజాగా బాలయ్యతో నటించిన ‘జై సింహా’లో కూడా దుస్తులు, హీరోతో సన్నిహితంగా నటించే విషయాల్లో పరిమితులు పాటించిందట. ఇమేజ్ ఉన్నంత కాలం ఆమె సినిమా కెరీర్ ఇలానే సాగుతుందని అంటున్నారు ఆమె సన్నిహితులు. శరత్‌కుమార్‌కు జోడీగా అయ్యా చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార.. ఆ తర్వాత రజనీకాంత్‌కు జోడీగా చంద్రముఖిలో నటించి మెప్పించారు. 14 ఏళ్ల క్రితం సీనియర్ హీరోలకు జోడీగా పరిచయమైన ఈ అమ్మడు ఇప్పుడు యువ హీరోల కథానాయకగా మెప్పిస్తుండటం విశేషం. ఆరంభంలో రెండో నాయక, ప్రత్యేక గీతాల్లో చిందులేసే పాత్రలు పోషిం చినప్పటికీ.. నటనను మాత్రమే నమ్ముకున్న నయన్.. చిత్రపరిశ్రమలో సీనియర్ అయ్యే కొద్దీ అవకాశాలను పెంచుకుంటున్నారు. బాలకృష్ణ, ఎన్‌టిఆర్, వెంకటేష్, రానా..ఇలా బాబాయ్, అబ్బాయలతో జోడీ కడుతూ అందర్నీ ఆశ్చర్యపరస్తున్నారు. జై, శివకార్తీకేయ న్, విజయ్, సేతుపతి వంటి నేటితరం హీరోలతో జోడీ కడుతూ ఇంకా తనకెరీర్‌ను తీర్చిదిద్దుకొంటున్నారు. అంతే కాకుండా, మాయా చిత్రం నుంచి కొత్త పోకడతో పయనిస్తున్నారు. జీవా, కార్తి, అజిత్, విజయ్‌లతో జోడీ కడుతూనే కథానాయక నేపథ్య సినిమాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల వచ్చిన అరం చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే ప్రస్తుతం కోలమావు కోకిల, కొలై యుదిర్ కాలం వంటి భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా లక్ష్మీ అనే లఘు చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న సర్జున్ దర్శకత్వంలోని సినిమాలలోను నటించడానికి అంగీకరించారు. నయన్ చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు అయ నప్పటికీ.. ఆమె క్రేజ్ పెరుగుతోందే కానీ ఏ మాత్రం తగ్గలే దు. అందుకే అభిమానులు ఆమెను లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తుం టారు. కాగా నయన్ ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విఘ్నేశ్ కూడా నయన్‌పై ఉన్న ప్రేమను టీట్ల ద్వారా కూడా రుజువు చేశాడు. పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో కలిసి అమెరికా ట్రిప్‌కు వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను కూడా ట్విటర్‌వేదికగా పంచుకున్నారు. అంతేకాదు, ఈ జంట విమానాశ్రయాల్లో అనేక సందర్భాల్లో మీడియా కంటపడింది. దీంతో ప్రేమ వ్యవహారం నిజమేనంటూ ప్రచారం జోరం దుకుంది. విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయన్లుగా నటించిన చిత్రం నానుమ్ రౌడీదాన్ (తెలుగులో నేనూ రౌడీనే). దీనికి విఘ్నేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలో దర్శకుడు, నయన్ అభిప్రాయాలు కలిసి స్నేహితులయ్యారట. ఆ తర్వాత అది ప్రేమగా మారిందట. అయతే ఇదంతా గతం.. ఇప్పుడు ఆమె ఎక్కువగా కెరీర్‌పైనే దృష్టి సారించింది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమబిజీగా ఉంది. తన కోసం మరిన్ని అవకాశాలు సిద్ధంగా ఉన్నాయంటోంది. దటీజ్..నయన్!!

-ఉషశ్రీ తాల్క