Others

సంతోషం అంటే అది స్ర్తి రూపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముదితల్ నేర్వగలిగిన విద్య కలదే ముద్దార నేర్పించినన్’’ అన్న కవి నానుడిని అనుసరించి, మహిళలు అన్నిరంగములలోను తమవైన ప్రతిభను చాటుతున్నారు. రక్షణ, నేవీ త్రివిధ దళాలలో సైతం మహిళ లే ముందుంటున్నారు. మహిళే మహాలక్ష్మి. లక్ష్మీ అనగా సంపద, బంగారము అని అనుకొంటారు కాని మంగళకరమైన వస్తువులన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మీ కళలే. గోవులు, పూలు, పాలు, సుగంధ ద్రవ్యములు, పసుపు కుంకుమ, శుచి, శుభ్రముగా ఉండే గృహములు లక్ష్మీ నివాసములు. ఇంటికి గృహిణి లక్ష్మీ స్వరూపము. ప్రతి దానిలోనూ లక్ష్మీ స్వరూపాన్ని చూచి తరించేవారు ఎల్లపుడూ సుఖసంతోషాలతో, నిత్యానందంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో విలసిల్లుతారు.