సబ్ ఫీచర్

ప్రణాళికతో పడతి పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయపాలన అందరికీ అవసరమే... కేవలం విద్యార్థులు సమయపాలన పాటిస్తే చాలంటుంటారు కొంతమంది. కాదు నేడు ఇంట్లో ఉన్న వారంతా ఏదో ఒక పనుల మీద బయటకు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అందరికీ అన్నీ సమయానికి ఇవ్వవలసిన బాధ్యత మాత్రం అందరికన్నా ఎక్కువగా మహిళలమీదే ఉంది.
ఇది కాదనలేము. ఎంత చేసినా ఇంకా మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనేవాళ్లే ఎక్కువ. మొన్నామధ్య ఒకరు తనకు టైముకు టిఫిన్, అన్నం, మంచినీళ్లు ఇవ్వడం లేదు అంటూ ఉద్యోగిని అయన భార్యమీద ఫిర్యాదు చేసి విడాకులు కావాలని కోర్టుకు వెళ్లాడట ఓ మగమహారాజు.
చూసారా చోద్యం? అతను కోర్టుకు వెళ్లాడు. కాని అందరిండ్లల్లోను నూటికి ఎనభై శాతం ఇదే పరిస్థితి. కోర్టుకు వెళ్లడంలేదు కాని కిచకిచలు తప్పడం లేదు.
అందుకే మహిళలే దీనికి చిట్కాలు కనిపెట్టుకోవాలి.
ప్రతిరోజు ఉద్యోగం చేసే మహిళకైనా, ఇంట్లో గృహావసరాలను చూసే గృహిణికైనా ఒక్కఆదివారమే కాస్తంత వెసలుబాటు కలుగుతుంది. ఆ ఆదివారాన్ని పక్కగా ప్లాన్ వేసుకొంటే వారమంతా సంతోషంగా పనులు చేసుకోవచ్చు. ఆదివారం సద్వినియోగం చేసుకొంటే చాలు మిగిలిన ఆరురోజులూ ఎర్రటి కళ్లతో కాక చల్లని చూపుతో గడపవచ్చు.
ఆదివారం నాడు కనీసం అరగంట సమయాన్ని మరుసటి వారానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకునేందుకు కేటాయించాలి.
సోమవారం నుండి శనివారం వరకు చేయాల్సిన పనులు ఏమిటో గుర్తించి ఒక చోట నమోదు చేయండి. ఆ పనులలో తిరిగి ఏ రోజు ఏ పని చేయాలో నిర్ణయించుకోండి. వ్యక్తులను కలవాల్సి వున్నా, పెళ్లిళ్లు, పేరంటాలు ఇతర కుటుంబ ఫంక్షన్సు ఏవైనా వుంటే వాటి సమయం దేనికి ఎంత సమయం కేటాయించడం అవసరమో స్పష్టంగా కాగితం మీద రాసుకోండి.
మీరు కలుసుకోవాలనుకుంటున్న వ్యక్తులతో సమావేశ సమయాన్ని నిర్థారించుకోండి. ఫోన్ చేసి లేదా మెయిల్ ద్వారా ప్రోగ్రామ్‌ని ధృవీకరించుకోవాలి. లేకుంటే అనవసరంగా వెళ్లి విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది. ఏవారంలో ఏం చేయాలో నిర్ణయించుకున్న తర్వాత ఏ రోజులో ఏ సమయంలో, ఏ పని చేయాలన్నది నిర్ణయించుకోవాలి. పనులను ప్రాధాన్యతా పరంగా ఒకటి, రెండు మూడు, నాలుగుగా విభజించుకోండి. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్య చేసేలా పెట్టుకోండి. ఆ తర్వాతి క్రమంలో ప్రాధాన్యతలను నిర్ణయించాలి. తక్కువ ప్రాధాన్యత కలిగినవి చిట్టచివరిగా రాసుకోండి.
ఆదివారం కాబట్టి కాస్తంత విందులు, వినోదాలు, కాలక్షేపం ముచ్చట్లు కూడా మీ కార్యక్రమంలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి స్వంత విషయాల గురించి చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆదివారం నుండి మరో ఆదివారానికి మధ్య తప్పకుండా ఎంతో కొంత అభివృద్ధి ఏ విషయంలోనైనా ఉండేటట్లు చూసుకోండి.

-శ్రీలత