మెయిన్ ఫీచర్

జయశబ్దం సత్యవాదికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యథార్థవాది లోక విరోధి’ అన్నారు. యథార్థం చెబితే అందరికి విరోధి అవుతాడు. నలుడు, హరిశ్చంద్రుడు వంటి మహానుభావులు తమ జీవితాలను సత్యానికే అంకితం చేశారు.నిజం నిర్భయంగా చెప్పగలగడం అందరికీ చేతకాదు. సత్యాచరణ కత్తిమీద సాము వంటిది. సత్య రక్షణ చేయడంలో కొన్ని సమయాల్లో సంకట పరిస్థితి ఎదురవుతుంది. సత్యాన్ని పలికే వారికి తాత్కాలికంగా అగ్నిపరీక్షలు, విపత్కర సమస్యలు తారసిల్లినా వారికి సాధ్యం కానిదిలేదు. హరిశ్చంద్రుడు తనకొడుకు మరణావస్థలో ఉన్నా, తన భార్య అష్టకష్టాలు పడినాతనకే తినడానికి తిండి దొరకకపోయనా సరే సత్యాన్ని మాత్రం వదలలేదు. భగవంతుడే హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చారు. ఆయన సత్యనిష్ఠ చూసి ఎంతో మురిసిపోయ ఎన్నో వరాలనిచ్చాడు. ధర్మం అన్నది కాల రీత్యా మారుతున్నా సత్యం మాత్రం ఎన్నటికీ ఒకేరీతిలో ఉండేది కనుక సత్యాన్ని సదా ఆచరించాలి అసత్యం అన్నది ఏనాటికి దరిచేరనివ్వకూడదు. నలుడు తన్ను వలచిన దమయంతిని పెళ్లి చేసుకోవాలని వెళ్తూ కూడా దేవతలు తమకోసం రాయబారం చేయమంటే చేస్తానని దేవతలు కోరిన విధంగా చేసాడు కాని అసత్యం జోలికి వెళ్లలేదు. అందుకే నలుని సత్యవ్రతం వల్లనే ఆయనకు ఎంత కీడు కలి కలిగించాలనుకొన్నా సాధ్యపడక చివరకు కలినే తలవంచాల్సి వచ్చింది. సత్య మన్నది అంతటి శక్తివంతమైనది. నేడు కలి బాధల నుంచి తప్పించుకోవాలంటే సత్యధారణ ఒక్కటే మార్గం. అత్యాశలు, అన్యాయాలు చేయకుండా అధర్మానికి తలవంచకుండాకేవలం సత్య ధారణ చేస్తే చాలు భగవంతునికి మనిషి అంత తేడా ఉండదు. సాధారణ మనిషి ని కూడా దివ్యునిగా చేయగలిగిన శక్తి ఒక్క సత్యానికే ఉంది.

-ఆర్. పురంధర్, 9642783331