‘శీలవతి’ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది సంచలన తార షకీలా ముఖ్యపాత్రలో అర్జున్, గీతాంజలి నటిస్తుండగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో రాఘవ.ఎం, గణేష్, వీరూ బాసింశెట్టి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శీలవతి’. కేరళలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ- ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది నా 250వ చిత్రం. చాలా ప్రాముఖ్యత వున్న పాత్ర ఇది. నెక్స్ట్ సీన్ ఏమిటనే విషయం తెలియకుండానే స్క్రీన్‌ప్లే వుంటుంది. దర్శకుడు, నిర్మాత ఇద్దరూ సినిమా విషయంలో చాలా కష్టపడ్డారు అన్నారు. గీతాంజలి మాట్లాడుతూ- షకీలాతో ఇది నా రెండవ చిత్రం. యంగ్ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- మా బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మేలో విడుదల చేస్తామన్నారు. దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ- నిర్మాతలు చాలా మంచి సపోర్టు అందించారు. టెక్నీషియన్లు కూడా బెస్ట్ ఔట్‌పుట్‌ను ఇచ్చారు. ఈ సినిమాలో షకీలాను చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతకుముందు వున్న షకీలాకు ఈ సినిమా తరువాత షకీలాకు చాలా తేడా వుంటుంది. ఈ సినిమాతో మళ్లీ ఆమె కెరీర్ పుంజుకుంటుంది అన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది అన్నారు.