సబ్ ఫీచర్

సాధికారత మాటలకే పరిమితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా చోట్ల స్థానిక సంస్థల్లో పలువురు రాజకీయ నాయకులకు పట్టు ఉంది. అయితే ఆయా చోట్ల మహిళా రిజర్వేషన్ వస్తే తమ కుటుంబంలోని వారిని, అనుచర కుటుంబాల్లోని మహిళలను ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకుంటున్నారు. వారిని నామమాత్రంగా కూర్చోబెట్టి అధికారం చెలాయిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో కూడా వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మహిళలకు రిజర్వేషన్, మహిళా సాధికారత అభాసుపాలవుతున్నాయని విశే్లషకుల అభిప్రాయం. సగానికి పైగా మహిళా ప్రజా ప్రతినిధులు స్వతంత్ర నిర్ణయాలకు దూరంగానే ఉంటున్నారు. పెత్తనమంతా భర్త, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులదేనని క్షేత్రస్థాయిలో వెల్లడవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు గర్భధారణ సమయంలో లభించే సెలవును 3 నెలల నుంచి ఆరు నెలల వరకు పెంచడం, మహిళలకు నైపుణ్య అభివృద్ధి కల్పించడం లాంటి కార్యక్రమాలు మహిళా సాధికారితకు తోడ్పడేవే. లింగ అసమానతల ప్రపంచంలో చదువు, ఉద్యోగం, పునరుత్పత్తి హక్కుల విషయంలో మహిళలు వివక్షకు గురవుతున్నారు. ఈ విషయంలో భారత పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఐక్యరాజ్యసమితి జనాభానిధి సంస్థ విడుదల చేసిన 2017 నివేదిక వెల్లడించింది. సామాజిక లింగ అసమానతలు, బాల్య వివాహాల సూచికలో భారత్ సరిగ్గా మధ్యస్థాయిలో ఉంది. భారత్‌లో 27 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రపంచ సగటు 28 శాతం కావడం గమనార్హం. దక్షిణాసియాలో భూటాన్ ఈ విషయంలో అందరికన్నా నయంగా ఉంది. కుటుంబ, శ్రామిక, శిక్షాస్మృతి చట్టాల్లో సమానత్వం విషయంలో భారత్ పరిస్థితి చాలా దేశాలకంటే మెరుగ్గా ఉంది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్‌లలో మాత్రమే స్ర్తి, పురుషుల మధ్య వేతన అసమానతలు అధికంగా ఉన్నాయి. నేపాల్, భూటాన్ ఈ రెండు దేశాలకన్నా మెరుగ్గా ఉన్నాయి. 90 దేశాల పట్టికలో భారత్, పాకిస్తాన్ తర్వాత స్థానంలో జోర్డాన్ ఉన్నది.

- కె.రామ్మోహన్‌రావు