16న కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది అన్ని భాషల్లో నటించిన స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్ దర్శకత్వంలో శివలింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజీ ప్రాజెక్ట్‌లతో విజయాల్ని సాధిస్తున్న నార్త్‌స్టార్ ఎంటర్టైనె్మంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఆరమ్’ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం మొదటి లుక్ టీజర్‌ని విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తమిళంలో ఆరమ్ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. నయనతార కెరీర్‌లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. తెలుగులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 16న విడుదల చేస్తున్నాం. నిత్యం మనం న్యూస్ చానల్‌లో చూస్తున్న బోరుబావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని సహజత్వానికి బాగా దగ్గరగా ప్రతి ఒక్కరి హృదయం తడిసేలా అద్భుతమైన నేరేషన్‌తో దర్శకుడు గోపీ నైనర్ తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్రలో నయనతార నట విశ్వరూపానికి ప్రేక్షకులు జైజైలు కొట్టారు.