అందులో నిజం లేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్ద కాలం పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీయ గురించి తాజాగా ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. రష్యాకు చెందిన వ్యక్తిని ప్రేమిస్తుందనీ త్వరలో వీరిద్దరి వివాహం జరగనుందంటూ వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా శ్రీయతో పాటు అతగాడున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ విషయంపై శ్రీయ స్పందిస్తూ మాపై వస్తున్న వార్తల్ని గమనిస్తాను అయితే ఇలాంటి వార్తలు చాలా బాధపెడతాయి, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులను కలవర పరుస్తాయి, ఇలాంటి వార్తలు విన్నపుడు భయమేస్తుంది, నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లే, నేను వివాహం చేసుకుంటానని వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అదంతా ఉత్త అబద్ధమే, నటిగా దశాబ్దానికి పైగా ప్రయాణం సాగిస్తున్నాను, వృత్తిని ఆస్వాదించినప్పుడే నటిగా కొనసాగగలం అన్నారు.