వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు (షణ్ముఖశ్రీ కథలు 8897853339)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సంతోషమే. కానీ, ఈ రోజుల్లో ఒకరి సంపాదన ఏం సరిపోతుందండీ’’
‘‘మరైతే ఏ చేద్దామంటారు?’’
‘‘మీకున్న ఆస్థి అమ్మి అమ్మాయి పేర బ్యాంకులో వేయండి. ఆ వడ్డీతో వాళ్లిద్దరూ హాయిగా బతుకుతారు’’.
‘‘మరి మా గతి’’ అన్నారు నీరసంగా రత్నంగారు.
‘‘అధోగతే’’ అని మెల్లగా అంటూ ఫోను పెట్టేసిన చప్పుడయింది. ఆయన మెల్లగా అన్నా రత్నంగారి చెవిన పడి బుర్ర వేడెక్కింది.
‘‘వీడికి ఆడపిల్లలు లేరు. అందుకే వేగిపోతున్నాడు. వీడి అదిరిపాటు ఇలాగే సాగితే, ఆ మగపిల్లలు మాత్రం ఊరుకుంటారా? తన్ని తగలేసి, నడిచి వెళ్లడానికి వీలుగా వున్న శ్మశానం పక్క వృద్ధాశ్రమంలో పడేస్తారు. అప్పుడు తెలుస్తుంది. ఎవరిది అధోగతో’’ అంటూ విసుక్కున్నారు. కాసేపుతర్వాత మళ్లీ డయల్ చేశారు మరో నంబర్‌కి.
‘‘హలో!’’ అటునుంచి ‘‘హలో’’ అనానే తనగోడు వెళ్లబోసుకున్నారు.
‘‘బాగుందండీ! మాకసలు కట్నకానుకల మీద ధ్యాస లేదండీ.పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితే చాలండీ!’’
‘‘ఎంత మంచి వారండీ!’’
‘‘మరీ అంత పొగడకండి’’
‘‘లాంఛనాలు కూడా వద్దా!’’
‘‘ఆఫీసులో తీసుకున్న లంచాలతోనే బోలెడు సంపాదించా! ఇంకా నాకెందుకండీ ఈ లాంఛనాలూ, వాంఛితాలూనూ. కట్నకానుకలు ఒద్దనుకున్నా, పెళ్లి మా గౌరవానికి భంగం లేకుండా జరగాలి కదండీ!’’
‘‘అయ్యయ్యో! ఎంతమాట. తప్పకుండా అలానే జరిపిస్తాం!’’
‘‘ఏం జరిపిస్తారో ఏమో! మా బలగం ఎక్కువ. మాకున్న ఆ ఒక్క అబ్బాయి పెళ్ళీ ఎప్పుడా ఎప్పుడా అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. ఆ రోజుల్లో లాగా అయిదు రోజుల పెళ్ళిళ్ళు, అయిదువేల అప్పడాలు వత్తడాలూ, ఆవకాయ కారాలు దంచడాలూ, లేవు కదండీ. అయినా ఒక్క సాంబారుతో సాగనంపలేం కదండీ!’’
‘‘హ!హ! బలేవారండీ! ఏ క్లాస్ కేటరింగుకు ఆర్డరిస్తాం. వాళ్ళే అన్నీ నిమిషాల మీద తెచ్చి సప్లయ్ చేస్తారు. స్వీట్సు, హాట్సు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, కిళ్ళీలు, ఒకటేమిటి..’’
‘‘అంటే మీ ఉద్దేశం. ఏ వంద మందికో ఆర్డరిచ్చేస్తే సరిపోతుందనుకుంటున్నారా?’’
‘‘మరి!’’
‘‘అసలైనా ఈ మధ్య ఈ కేటరింగులు అంత బాగుండటం లేదని విన్నాం. పొడిపొడి పచ్చళ్ళూ, హడావిడి వడ్డనలూ, శుచీశుభ్రం, రుచీపచీ లేని పాచిపోయిన వంటకాలూ, భోజనాలనంతరం వికారాలూ, కొందరైతే ఈ చీదర భోజనాలు చేసినా చెయ్యక పోయినా, చదివింపులు కాగానే విదిలింపులూ, చీదరింపులతో, ఇంటికెళ్లి వండుకోవడాలూ, తిని ఏడవడాలూ, పక్కడాబాల వాళ్లు నవ్వడాలూ, అందువలన మేము ఏర్పాటు చేసిన కుక్కుల చేత, వారు కోరిన అన్నీ రకాల సరుకులు తెప్పించి, కమ్మగా చేయించి, మా నాలుకలు ఊరేలా వడ్డించాలి. అంతేగానీ కుక్కలకు పడేసినట్లు అది కాస్తా ఇది కాస్తా వడ్డిస్తే, మమ్మల్ని అవమానించినట్లుగా భావిస్తాం. నాలుగు పూటలూ ఈ విందులు ముగిశాక, సినిమా పాటల చిందుల కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలి. ఇవన్నీ ఎంతమందికి అనుకుంటున్నారు. దాదాపు ఓ రెండు వేల మందికి. మా పొలంలో పనిచేసే రైతులు, వాళ్ళ కుటుంబాల వారు కూడా తరలి వస్తారు. మర్యాదలలో ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా, ఆత్మహత్యలూ, లేదా ధర్నాలూ, ఏమైనా జరగొచ్చు. మంత్రులూ, విఐపీలూ చాలామంది వస్తారు. కొన్ని సందర్భాల్లో ఇదే వాళ్ల పార్టీ మీటింగ్‌గా మారవచ్చు. మా అబ్బాయి ఆఫీసు స్ట్ఫా సరేసరి. వీళ్ళల్లో కొందరు పేకముక్కలు కోరవచ్చు. మందు పార్టీ అంటూ చొచ్చుకు రావచ్చు. పాప్ డాన్సులంటూ పదేపదే మీమీద పడొచ్చు. ఈ చిన్నచిన్న కోరికల్ని మీరు కాదనరనుకుంటా. అలా అయితే మీ అమ్మాయిని ఎప్పుడొచ్చి చూసేది చెప్తాం’’ అంది అవతలి కంఠం.
నోట మాట రాక, ఫోన్ అలానే పక్కన పడేసి కూర్చుండి పోయారు రత్నం గారు.
‘‘ఏమిటి మాటా లేదూ, పలుకూ లేదు. హార్ట్ ఎటాక్ కాదు కదా! హలో!’’ అంటూ అవతలి కంఠం ఆగిపోయింది.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)