రాష్ట్రీయం

సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఫిబ్రవరి 14: అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీశ్రీశ్రీ సంత్‌సేవాలాల్ మహరాజ్ 277వ జయంత్యుత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సేవాలాల్ జయంత్యుత్సవాలను ఆలయ కమిటీ నిర్వాహకులు బోగ్ కార్యక్రమంతో ప్రారంభించారు. అనంతరం 101 మంది కన్యలు కళశాలు ధరించి నూతనంగా నిర్మించిన మాత జగదాంబ ఆలయం నుంచి శ్రీశ్రీశ్రీ సంత్‌సేవాలాల్ మహరాజ్ ఆలయం వరకూ ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి భక్తులు పెద్దఎత్తున సేవాఘడ్‌కు చేరుకుని సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండ ఆలయ ప్రాంగణంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇకపోతే వివిధ రాష్ట్రాల నుంచి సేవాలాల్ మహరాజ్ దీక్ష చేపట్టిన భక్తులు ఇరుముడులతో సేవాఘడ్ చేరుకున్నారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగంలో స్వామివారికి ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బంజారాలు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.