రాష్ట్రీయం

పెళ్లి వేడుక.. వెంటనే చావుకేక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 9: కాళ్ళపారాణి ఆరకముందే ప్రమాదం రూపంలో వారిని మృత్యువు వేరు చేసింది. వివాహం వైభవంగా జరిగిందనే ఆనందం నుండి బయటకు రాకముందే వారి కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్ (35)కు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అమ్మాజీ దుర్గతో గురువారం రాత్రి వివాహం జరిగింది. అనంతరం నూతన వధూవరులతోపాటు పెళ్లి కొడుకు అక్కలు, బావలు, మేనకోడలు, మేనల్లుళ్ళతో కలిసి ఐదుగురు ఇన్నోవా వాహనంలో వర్థన్నపేటకు ప్రయాణమయ్యారు. కొణిజర్ల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి స్టేట్ హైవే పక్కనున్న చెట్టును ఢీకొంది. దుర్ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పెళ్లి కుమారుడితోపాటు అక్కలు శేషం పద్మ (42), కోమండూరు శ్రీదేవి (37), బావ శరత్ (39), డ్రైవర్ వడ్డకుంట వేణు (38) అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు పద్మ భర్త చలపతి, కుమారుడు రామన్, మృతులు శ్రీదేవి, శరత్ పిల్లలు రిషత్, మహతి తోపాటు పెళ్లి కుమార్తె దుర్గకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగమంచుతోపాటు వాహనం వేగంగా వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన తరువాత మృతుల బంధువులు వర్థన్నపేట, తణుకుల నుంచి ఖమ్మంకు చేరుకున్నారు. వీరి రోదనలతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మిన్నంటింది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరణించటంతో ఆ కుటుంబంలోని వారి రోదనలు ఆపటం ఎవరివల్లా కావటం లేదు. తమ ఇంట పెళ్లికి వచ్చిన చెల్లి, అక్క, బావలను కూడా కోల్పోవాల్సి వచ్చిందని పెళ్లికొడుకు బంధువులు వాపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన పెళ్లికొడుకు మరో బావ చలపతి, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బాణోత్ దమన్‌లాల్, ఇన్‌చార్జి ఎస్పీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. భార్యా భర్తలైన శ్రీదేవి, శరత్‌లు చనిపోవటంతో పిల్లలు అనాథలయ్యారు.
chitram...
చెట్టును ఢీకొని నుజ్జయిన వాహనం. (ఇన్‌సెట్‌లో) ప్రమాద స్థలంలో మృతదేహాలు