AADIVAVRAM - Others

తొక్కుడు బిళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు ఆడపిల్లలు కాని నలుగురు కాని ఈ ఆట ఆడుతుంటారు.
నలుగురు ఆడినప్పుడు ఇద్దరిద్దరు ఒక జట్టుగా ఉంటారు. నలుచదరపు గీత ఒకటి గీస్తారు. అందులో మళ్లీ ఆరు గళ్లు అంటే ఒకవైపు మూడు మరోవైపు మూడు ముందు ఒక గడి ఉండేవిధంగా అడ్డుగీతలు గీస్తారు. మొత్తానికి ఏడు గళ్లు ఉంటాయ. ఈ గళ్లనే ఒక్కో ప్రాంతంలో గుండాలు అని కూడా అంటారు.
మొట్టమొదట ఇద్దరు అమ్మాయిలు కలసి ఎవరు ముందు ఆడాలి అని నిర్ణయించుకోవడానికి ఒక రూపాయి బిళ్లను తీసుకొని బొమ్మ బొరుసు వేస్తారు. బొమ్మపడిన అమ్మాయి ముందు ఈ తొక్కుడు బిళ్లను ఆడుతుంది.
చిన్న పెంకు లేక మరే దైనా చిన్నపాటి నలుచదరంగా ఉండేది తీసుకొని ఇంతకుముందు గీచిన నలుచదరపు గళ్లు అడ్డుగీతలున్న డబ్బాల్లోకి విసురుతుంది. ఆ పెంకు పడిన చోటికి నలుచదరపు గళ్ళల్లో ఒంటికాలుతో కుంటుతూ వెళ్లి ఇందాక విసిరిన పెంకుపై కాలు పెడుతుంది. ఆ పెంకును కాలితోను ముందుకు తోసుకొంటూ వచ్చి నలుచదరపు గడిని బయటకు తోసేస్తుంది. అట్లా తోసేసిన తరువాత అంటే నలుచదరపు డబ్బాను దాటి ముందుకు వస్తే ఆట అయిపోయినట్లు. ఒకవేళ గడియ ల మధ్యలో కుంటే కాలును కింద పడితే ఔటు అయిపోయినట్టు. తిరిగి ఆ అమ్మాయి మొదటి నుంచి ఆడాలి. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. ఇపుడు బొమ్మ పడిన అమ్మాయి ఆడుతూ ఆ పెంకును బయటకు తోసేసి వస్తే ఇంతకుముందు గడిలో వేసిన గడి ఆమెకు సొంతం అవుతుంది. దానిలో రెండు గీతలు అటు ఇటూగా గీస్తారు. రెండవ అమ్మాయి ఆడేటపుడు ఆ అటు ఇటు గీచిన గీతలున్న గడియ ను తొక్కకుండా ముందుకు వెళ్లాలి. మళ్లా ఆ అమ్మాయి కూడా ఆమె విసిరిన పెంకును కుంటుతూ వెళ్లి దాన్ని కాలితో తోసుకొంటూ ముందుకు తేవాలి. ఇలా ఎవరైతే అన్ని గడియలు సొంతం చేసుకొంటారో లేకుంటే ఎవరు ఎక్కువ గడియలు సొంతం చేసుకొంటారో వారు గెలిచినట్టు. ఆడేటపుడు కాలు కిందపెట్టినా, లేక అవతల వారి గడిలో కాలు పెట్టినా , లేదా గడియ మధ్యలో కాక అడ్డుగీతలపై కాలు పెట్టినా వారు ఔటు అయిపోయినట్టు భావిస్తారు.
ఇట్లా ఆడే ఆటలో ఉత్సాహం ఎగిరేశక్తి ఆడపిల్లలకు ఒనగూడుతుంది.

-జంగం శ్రీనివాసులు