రాష్ట్రీయం

రాజ్యసభకు తెరాస అభ్యర్థులు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాష్ ముదిరాజ్ (వరంగల్) ఖరారయ్యారు. రెండు స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయస్తూ తెరాస వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన అనంతరం సీఎం కేసీఆర్ వారిని ఎమ్మెల్యే, ఎమెల్సీలకు పరిచయం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు. దీంతో ముగ్గురూ సోమవారమే నామినేషన్లు దాఖలు చేస్తారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ యాదవ, ముదిరాజ్ కులాలను ఆకర్షించేందుకు లింగయ్య యాదవ్, ప్రకాష్ ముదిరాజ్‌ను ఎంపిక చేశారు. మరో స్థానంలో కేసీఆర్ తన తోడల్లుని కుమారుడైన సంతోష్‌కుమార్‌ను ఎంపిక చేశారు. తెరాస ఆవిర్భావం నుంచీ సంతోష్ కేసీఆర్‌తోనే ఉన్నారు. పార్టీలో సంతోష్ అంటే తెలియని వారు లేరు. అందరినీ చిరునవ్వుతో అప్యాయంగా పలుకరించే సంతోష్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తమను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయడం పట్ల అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని అంటూ కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశానికి కేసీఆర్ దిక్సూచి వంటి వారని బండ ప్రకాష్ అన్నారు. రెండు సీట్లను బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. ఇలాఉండగా సోమవారం కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె. జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియాతో చర్చించి నిర్ణయంచినట్టు తెలిసింది.
chitram...
తెరాస రాజ్యసభ అభ్యర్థులు సంతోష్‌కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాష్