సాహసం శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ఎ గురు ఫిలింస్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- తమిళంలో కూడా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రహమాన్, నాగచైతన్యతోపాటు తాను పనిచేస్తున్నానని, గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని, ఈ సినిమా పేరుకు తగిన విధంగా చిత్రం వుంటుందని తెలిపారు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో సాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా వున్నాయని, మలయాళ నటి మంజిమా మోహన్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని, షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలో పాటలు, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.