రాష్ట్రీయం

మూడురోజులూ మజా..మజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలీసు యంత్రాంగం రెండు వారాల ముందు నుంచే ఎన్నిరకాల హెచ్చరికలు చేసినా, వందలాది మంది జూదరులపై బైండోవర్ కేసులు పెట్టినా భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజుల్లోనూ కృష్ణా జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా జరిగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. నిర్వాహకులు ఇబ్బడిముబ్బడిగా ఏడాది పాటు తమ సరదాలు తీర్చుకునే రీతిలో అర్జించారు. అప్పోసొప్పో చేసి కోడి పందాలకు వచ్చినవారు జూదంలో తమ సొమ్ము పోగొట్టుకుని ఇంటిముఖం పట్టేందుకూ రవాణా చార్జీలు కూడా లేక నేరాలకు పాల్పడిన ఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు సంక్రాంతి రోజు కృష్ణా జిల్లా గుడివాడలో తాళం వేసిన ఇంటిలోకి జొరబడ్డారు. బీరువాలు, లాకర్లు ధ్వంసం చేసి వాటిలోని సొమ్ము దోచుకెళ్లారు. అయితే గోడలు దూకి పారిపోయే సమయంలో ఒక వ్యక్తి జేబులో నుంచి జారిపడిన ఆధార్ కార్డు ఆధారంగా అతని జాడ కోసం ప్రత్యేక పోలీసు బృందం అనంతపురం బయలుదేరి వెళ్లింది. విజయవాడకు కూతవేటు దూరంలోని గ్రామంలో ఓ కార్పొరేట్ విద్యాసంస్థ ప్రాంగణంలో భారీగా కోడి పందాల నిర్వహణకు జరిగిన ఏర్పాట్లను పోలీసులు ధ్వంసం చేసినా చుట్టుపక్కల గ్రామాల్లో యథేచ్ఛగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పందాలు యథేచ్ఛగా సాగిపోయాయి.
'చిత్రం... కార్లు, ద్విచక్ర వాహనాలతో కిటకిటలాడిన బరుల ప్రాంగణాలు