రాష్ట్రీయం

లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌ను తనిఖీ చేసిన ద.మ. రైల్వే జీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న రైల్వే వర్క్‌షాపును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వర్క్‌షాపులోని వివిధ విభాగాలను ఆయన క్షణ్నంగా పరిశీలించారు. బోగీలకు చెందిన చక్రాలు, ఎయిర్‌బ్రెక్, కోచ్‌ల పేయింటింగ్, బోగీల స్ప్రింగ్ షాపులు, కొత్త బోగీల్లో గ్రీన్ టాయిలెట్స్ విభాగాలకు చెందిన వాటిని తనిఖీ చేశారు.
యాద్‌గిరి- ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు
రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 13న యాద్‌గిరి నుంచి (07423) ఢిల్లీకి ప్రత్యేక రైలు నడుపుతున్నారు. తిరుగుప్రయాణంలో (07424) ఢిల్లీ నుంచి యాద్‌గిరి (కర్నాటక) ఫిబ్రవరి 17న ప్రత్యేక రైలును నడుపుతారు.
'చిత్రం...సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే వర్క్‌షాపులో వివిధ విభాగాలను తనిఖీ చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం గజానన్, ఇతర సీనియర్ అధికారులు