రాష్ట్రీయం

వైభవంగా శ్రీ విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: సోషల్ మీడియా వేదికగా హైందవ సమాజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని విశాఖ శ్రీ శారదాపీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభయయ్యాయి. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మేలు కోరుతూ శారదాపీఠంలో యజ్ఞయాగాదులు చేపట్టామన్నారు. లోక కల్యాణార్థం, హిందూ సమాజ పరిరక్షణ కోసం, నిశ్చలమైన మనస్సుతో వేదపండితులు యాగం చేస్తున్నారని వివరించారు. ఈ వార్షికోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదీప్‌రాజు స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పీఠం ఆవరణలో ఉన్న శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

*చిత్రం... విశాఖ శ్రీ శారదా పీఠంలో పూజలు చేస్తున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి