రాష్ట్రీయం

కేంద్ర బడ్జెట్‌లో ‘విభజన’ ప్రాజెక్టుల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి కూడా విభజన నష్టానికి ప్రతిగా దక్కాల్సిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కలేదనిపిస్తోంది. నష్టాన్ని భర్తీచేయడంలో ఆశనిపాతమే మిగిలింది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులకు ఏదో నామమాత్ర కేటాయింపులతో చేయి విదిల్చారు. విభజన ద్వారా లభించే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత దక్కలేదు. ప్రధానంగా పట్టాలెక్కాల్సిన రైల్వే ప్రాజెక్టులతోపాటు గోదావరి జిల్లాల దశ, దిశను మార్చగల ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు రూ.5 లక్షల 40వేల కోట్ల మేరకు కేజీ బేసిన్‌లో విశేషమైన అభివృద్ధి జరగనుందని, కాకినాడ ప్రాంతం మరో ముంబాయి మహా నగరంలా మారనుందని ఎన్నో ఆశలు గొల్పారు. అందుకు తగిన రీతిలో బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది. కేజీ బేసిన్ డి-6 అభివృద్ధిలో భాగంగా పీసీ పీఐఆర్ (పెట్రో కారిడార్ పెట్రో ఇండస్ట్రీ రీజియన్), కోస్టల్ కారిడార్ ఆరు లేన్ల రోడ్లు, రిఫైనరీ, కేప్టివ్ పోర్టు, టెర్మినల్స్ ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి సంగతేమిటో తేలాల్సి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఊసేలేదు. రాజమహేంద్రవరం వద్ద ఆర్చి బ్రిడ్జిపై రెండో ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ బడ్జెట్‌లో మచ్చుకు కూడా నిధుల కేటాయింపు లేదు. పూర్వం నుంచి ఊరిస్తోన్న పిఠాపురం మెయిన్ లైన్, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, యాంకరేజి పోర్టు విస్తరణకు సంబంధించి న్యాయమైన రీతిలో నిధుల కేటాయింపు జరగలేదని కేంద్రం విమర్శలు మూటగట్టుకుంటోంది. దక్షిణ మధ్యరైల్వేలోనే కీలకమైన ఆదాయాన్ని సాధిస్తోన్న కాకినాడ పోర్టు స్టేషన్ గూడ్స్‌పరమైన అభివృద్ధి ప్రస్తావన లేకుండా పోయింది. ఇక జిల్లాలో పెట్రో యూనివర్సిటీని తన్నుకు పోయినందుకు ప్రతిగా వచ్చిన లాజిస్టిక్ ప్రాజెక్టు ఏమైందో తెలియని స్థితి. గోదావరి జిల్లాల్లో బకింగ్ హాం కెనాల్ అభివృద్ధి నాల్గవ జాతీయ జల రవాణా ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో న్యాయం జరగలేదంటున్నారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ ప్రస్తావన లేదు.
పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాల్సి ఉంది. ఖర్చంతా తామే భరిస్తామనే భరోసా మాత్రం మరోసారి ఈ బడ్జెట్‌లో దక్కిందంతే. సీ డబ్ల్యూసీ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామనే ప్రస్తావనే విన్పించలేదు. వంశధార, నాగావళి, బ్రహ్మపుత్ర, గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే పూర్తయి డీపీఆర్‌ల రూపకల్పన దశకు చేరింది.