రాష్ట్రీయం

గ్రామ సచివాలయాలు పక్కాగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 1: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పక్కాగా పనిచేసేలా సంబంధిత సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. విజయవాడకు సమీపంలోని జూపూడి గ్రామ సచివాలయాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, సెర్ప్ సీఈవో పీ రాజబాబు, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామ సచివాలయంలో ఏర్పాట్లు, సంబంధిత సిబ్బంది విధుల తీరును ఆయన పరిశీలించారు.
గ్రామ సచివాలయాల ద్వారా 536 సేవలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గ్రామ సచివాలయానికి వచ్చినవారు తమ అర్జీలు, ఇతర ధృవీకరణ పత్రాల కోసం ఎప్పుడు దరఖాస్తు చేసింది, వాటిని ఎప్పటిలోగా పరిష్కరించేదీ సమగ్ర వివరాలు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈసందర్భంగా కొందరు మహిళలకు ఆయన పింఛన్లు అందజేశారు.
డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్, డ్వామా పీడీ సూర్యనారాయణ, తహశీల్దార్ మధుసూదన నాయుడు, ఎంపీడీవో దివాకర్, కార్యదర్శి ఐవీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.