రాష్ట్రీయం

ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 1: ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీసు శిక్షణా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కె.రాజశిఖామణి అన్నారు. ఆయన ఇటీవల చీకటి ఖండంగా పేరొందిన ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. గతంలో యూరప్‌లో అతి ఎత్తయిన ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించారు. రాజశిఖామణి ‘ఆంధ్రభూ మి’తో మాట్లాడుతూ ఈ పర్వతాన్ని అధిరోహించినపుడు సూర్యాస్తమయం చూడడం అద్భుతంగా ఉందన్నారు. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతా న్ని అధిరోహించినపుడు ఉష్ణోగ్రతల హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించి న తాను ఈ పర్వతాన్ని అధిరోహించడం సునాయాసంగా జరిగిందని తెలిపారు. ఈ పర్వతాన్ని అధిరోహించేటపుడు సగం ఎత్తు వరకు కాఫీ తోటలు, అందమైన దృశ్యా లు కన్పించాయన్నారు. కాగా, ఈ ఏడాది ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించారు.

*చిత్రం...కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పీటీసీ రిటైర్డ్ ప్రిన్సిపల్ రాజశిఖామణి