రాష్ట్రీయం

సప్త వాహనాలపై సప్తగిరీశుని దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: భూలోక వైకుంఠమైన తిరుమలలో శనివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్య జయంతిని పురస్కరించుకుని సప్తగిరీశుడు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. స్వామివారి వాహన సేవలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలలో క్రీ.శ 1564 నుంచి రథసప్తమి పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. కాగా శనివారం ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సర్వలోకాలకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ శ్రీ సూర్యభగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.55 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘ్ఠించారు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆ దృశ్యాన్ని తిలకించి భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వాహనసేవ వైభవంగా జరిగింది. స్వామివారి సూర్యప్రభ వాహన సేవలో తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి పాల్గొన్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు, తమిళనాడు ఉళుదూరుపేటై ఎమ్మెల్యే కుమారగురు 5.5 ఎకరాల స్థలాన్ని టీటీడీకి విరాళంగా అందించారు. వాహన సేవలో స్థల పత్రాలను తమిళనాడు ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందజేశారు. కాగా అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనంపై ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేషవాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధ్ఫిలం లభిస్తుందని ప్రశస్తి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడునిపై కొలువుదీరిన అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడవీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.
వైభవంగా చక్రస్నానం
రథసప్తమి సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల నడుమ చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆ తరువాత వరుసగా కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడయ్యారు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.
కల్పవృక్ష వాహనం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
సర్వభూపాల వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, అగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కందాలపై, హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.
చంద్రప్రభ వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండటం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనస్సు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తపాలను ఇది నివారిస్తుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు సి.వెంకటప్రసాద్ కుమార్, వి.ప్రశాంతి, కుమారుగురు, శేఖర్‌రెడ్డి, ఇతర బోర్డు సభ్యులు, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యహృదయం, సూర్యాష్టకం
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదువుకుంటున్న 150 మంది విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడవీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. నాలుగేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఈ శ్లోకపారాయణంలో పాల్గొన్నారు.
*చిత్రం... రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల మాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు