రాష్ట్రీయం

మేడారానికి హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మేడారంలో జరి గే సమ్మక్క, సారలమ్మ మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ సర్వీసులను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రా రంభించింది. అబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆదివారంనాడు ఈ సర్వీసులను ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీలో భాగంగా దీనిని ప్రారంభించారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుండి మేడారంనకు, తిరిగి మేడారం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు వర కు హెలికాప్టర్ సర్వీసులను నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. అయితే, హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు రూ.1.80 లక్షలు ఉంటుందన్నారు. వీటితో పా టు మేడారం జాతర వ్యూ హెలికాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి రూ.2,999 నామమాత్రం చార్జీ వసూలు చేస్తామని వారు అన్నారు. మహాజాతరకు వచ్చి న భక్తులకు, ప ర్యాటకులు ఆయా సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ఫోన్
నెంబర్ 9400399999లో సంప్రదించవచ్చునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి, పౌర విమానయాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ భరత్‌రెడ్డి, టూరిజం శాఖ ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... బేగంపేట ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్ సదుపాయాన్ని ఆదివారం జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్