రాష్ట్రీయం

నవ్వుల రారాజును కేంద్రం గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(కల్చరల్): వెయ్యికి పైగా సినిమాలతో ప్రేక్షక లోకాన్ని కడుపుబ్బ నవ్వించిన హాస్యనట చక్రవర్తి బ్రహ్మానందం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1154 చిత్రాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం నట విశ్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తానన్నారు. అంతకుముందు రచయిత, రాజకీయ వేత్త దాడి వీరభద్రరావు, రైటర్స్ అకాడమీ ప్రతినిధి వీవీ రమణ మూర్తి బ్రహ్మానందం చలనచిత్ర జీవితంలో ఎన్నో మైలురాళ్లను వివరించారు. చివరగా బ్రహ్మానందం మాట్లాడుతూ తనను ఇంతగా ఆదరించి, సత్కరించిన రైటర్స్ అకాడమీ ఆత్మీయతను మరిచిపోలేనన్నారు.
*చిత్రం... సినీ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని సన్మానిస్తున్న కళాబంధు టీ. సుబ్బరామిరెడ్డి తదితరులు