రాష్ట్రీయం

ఊపిరి పీల్చుకున్న ఉప్పూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన: ఉప్పూడి గ్రామం ఊపిరి పీల్చుకుంది. రెండు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాస్ బ్లోఅవుట్ మంగళవారం ఉదయం అదుపులోకి వచ్చింది. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో కేఎఫ్‌హెచ్ చమురు సంస్థ నిర్వహణలో ఉన్న ఒక రిగ్ నుండి ఆదివారం సాయంత్రం నుంచి భారీగా గ్యాస్ లీకవుతూ భయానక వాతావరణం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ముంబై నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో స్థానిక ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కావడంతో అరగం ట వ్యవధిలోనే లీకేజీని అరికట్టగలిగారు. ఓఎన్జీసీకి చెందిన ఒక స్థానిక అధికారి సాహసోపేతంగా వ్యవహరించి గ్యాస్ లీకవుతున్న వెల్‌కు మూతవేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో కేఎఫ్‌హెచ్ చము రు సంస్థకు చెందిన పాత రిగ్ నుండి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గ్యాస్ బ్లోఅవుట్ ను అదుపుచేయడానికి ఆది, సోమవారాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ముంబై నుండి ఇద్దరు నిపుణులను రప్పించారు. ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్‌మెంటు జీఎం జి శ్రీహరి, మరో ఉన్నతాధికారి ఆదేశ్‌కుమార్ నాయకత్వంలో మొత్తం 18మంది బృందం మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అపరేషన్ ప్రారంభించింది. ఈ బ్లోఅవుట్‌ను అదుపుచేయడానికి మొదట వాటర్ ఆపరేషన్, అది విఫలమైతే మడ్ ఆపరేషన్‌కు ఏర్పాట్లుచేసుకున్నారు. వాటర్ ఆపరేషన్‌లో భాగంగా భారీ పైపులైను ద్వారా 360 డిగ్రీల్లో నీటి ఒత్తిడి ద్వారా రిగ్ నుండి బయటకు దూసుకువస్తున్న గ్యాస్ అదుపునకు చేసిన ప్రయత్నం ఫలించింది. రిగ్‌పై నుండి ఒత్తిడితో లీకవుతున్న గ్యాస్ నీటిని పైపులైన్ నీటితో వేగంగా కొట్టడం ద్వారా కొంచెం పక్కకు మళ్లేలా చేయగలిగారు. రిగ్‌పై గొడుగు ఆకారంలో నీటి కవచాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం రామారావు అనే ఓఎన్జీసీ అధికారి ఆక్సిజన్ పరికరం అమర్చుకుని సాహసోపేతంగా రిగ్ సమీపంలోకి వెళ్లారు. గ్యాస్ తనపైకి రాకుండా కుర్చీ అడ్డంపెట్టుకొని వెళ్లిన ఆయన రిగ్‌కు ఉన్న మూతను చాకచక్యంగా మూసివేయడంతో
కొంతసేపటికే గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది. దీనితో ఒక్కసారిగా అంతా సంభమ్రాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ఆపరేషన్ అంతా 30 నిముషాల్లోనే పూర్తికావడం విశేషం. నీటి ప్రయోగం విఫలమైతే 40వేల లీటర్ల మడ్‌ను పైపులైన్లో నింపి గ్యాస్ అదుపుచేయాలని భావించినప్పటికీ, కేవలం నీటి ఒత్తిడితోనే గ్యాస్ అదుపుకావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమయింది.
ఆపరేషన్ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్, రాష్ట్ర సాంఘిక సంక్షేమాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఓఎన్జీసీ అధికారులు ఆపరేషన్ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తంచేశారు. గ్యాస్ అదుపుతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
బ్లోఅవుట్ అదుపులోకి వచ్చిందనే సమాచారం తెలుసుకున్న చెయ్యేరు ఉన్నత పాఠశాల పునరావాస శిబిరంలో తలదాచుకున్న ఉప్పూడి గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆనందం వ్యక్తంచేశారు. పిల్లలతో తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భారీ ఓఎన్జీసీ వాహనాలు తిరిగి వెళ్లిన తరువాత సాయంత్రం 4గంటల సమయంలో మండలంలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామంలోని రక్షిత మంచినీటి పథకాలు పనిచేసి, కుళాయిల ద్వారా ప్రజలు రక్షిత నీరు అందింది. గత రెండు రోజులుగా చీకట్లో కొట్టుమిట్టాడుతున్న కాట్రేనికోన మండల ప్రజలలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ ప్రాంతంలో ఆయిల్ రిగ్‌ను శాశ్వతంగా తొలగించి, తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని అంతకుముందు ఉప్పూడి సెంటర్లో గ్యాస్ లీకేజీ బాధితులు మంత్రి విశ్వరూప్‌ను కోరారు.

*చిత్రాలు.. ఓఎన్జీసీ సిబ్బందితో కలిసి విజయోత్సాహం వ్యక్తం చేస్తున్న మంత్రి విశ్వరూప్
*క్యాప్ బిగించడంతో గ్యాస్ లీకేజీ నిలిచిపోయిన రిగ్