రాష్ట్రీయం

రాజ్‌భవన్‌లో గిరిజన నృత్యహేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం గిరిజన సాంస్కృతిక బృందాల నృత్యహేల కన్నుల పండువగా జరిగింది. న్యూఢిల్లీలో గత నెల 26 న భారత గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న గిరిజన సాంస్కృతిక బృందాలు గవర్నర్ తమిళిసైని కలిశాయి. 26 మంది కోయ, గోండు, బంజారా, తోటి, ప్రధాన్, డోలి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎదుట ఈ బృందాలు తమ గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనను ఇచ్చాయి.
రేలా రే రేలా రాగంలో గుస్సాడి, కొమ్ము కోయ నృత్యాలను తమ సంప్రదాయ దుస్తులు, వాయిద్య సహకారంతో చక్కగా అభినయించారు. కళాకారులు ప్రదర్శనను చూసి ముచ్చటపడ్డ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వారితో కలిసి కొద్దిసేపు నృత్యం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన హామీ ఇచ్చారు. తెలంగాణ కుంభమేళాగా పేరు వచ్చిన సమ్మక్క-సారాలమ్మ ఉత్సవాలకు ఫిబ్రవరి 7 న తాను హాజరవుతానని గవర్నర్ ప్రకటించారు. గిరిజన కళాకారులందరికీ శాలువాలు కప్పి, జ్ఞాపికలను గవర్నర్ అందించారు. ఢిల్లీ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జనవరి 26 న రిపబ్లిక్ డే ఉత్సవాల్లో తెలంగాణకు చెందిన గిరిజనులు చేసిన నృత్య ప్రదర్శనలకు నాలుగో బహుమతి లభించిందని కోయ, గిరిజన అధ్యయన సంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ఈ సందర్భంగా తెలిపారు. దేశం మొత్తం నుండి 23 గిరిజన బృందాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన అధ్యయన సంస్థ తరఫున ప్రొఫెసర్ జి. మనోజ, సోయం సుగుణాబాయి, పద్దం అనసూయ, జల్లి దామయ్య తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...రాజ్‌భవన్‌లో జరిగిన గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్