రాష్ట్రీయం

దక్షిణ మధ్య రైల్వేకి బడ్జెట్‌లో రూ.6,846 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి పనులకు రూ.6,846 కోట్లు మంజూరు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం గజానన్ పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులతో పాటు వౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా కొత్త రైల్వే లైన్లతో పాటు డబ్లింగ్ పనులను వేగవంతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జోన్‌లోని ఆరు డివిజన్లలో కొత్త రైల్వేమార్గాల కోసం రూ.2,856 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రస్తుతం సింగిల్ లైన్‌కు
అనుసంధానంగా డబ్లింగ్ పనుల కోసం రూ.3,836 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రైల్వే రవాణాను మెరుగుపర్చడానికి రూ.154 కోట్లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి రూ.672 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. రైల్వే మార్గంలో రోడ్డు ఓవర్, బ్రిడ్జిలు, క్రాసింగ్‌ల కోసం రూ.584 కోట్లు, రైల్వే ట్రాక్ మర్మమ్మతుల కోసం రూ.900 కోట్లు, మన్మాడ్, నాందేడ్, సికింద్రాబాద్, డోన్ (ద్రోణాచలం), గుంతకల్, బీదర్, పర్బనీ సెక్షన్ మధ్య వివిధ పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రైల్వేకి అవసరమైన విద్యుత్‌ను రానున్న రోజుల్లో సొంతంగా సోలార్ విద్యుత్ రైల్వే ట్రాక్ వెంబడి సోలార్ విద్యుత్ ఫలకాలు ఎర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 150 ప్రయాణికుల రైళ్లను అందుబాటులోకి రానున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర, దక్షిణ రైల్వే కారిడార్‌ల మధ్య ‘తేజస్’ రైళ్లను టూరిజం కోసం నడుస్తాయన్నారు. ధర్మవరం-పాకాల-కాట్పాడి మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.2,900 కోట్లు (290 కి.మీ) బీబీనగర్ (తెలంగాణ)-గుంటూరు మధ్య డబ్లింగ్ పనుల కోసం రూ.2,480 కోట్లు (248 కి.మీ) అకోలా-డోన్ వయా పూర్ణ, ముధ్‌కోడ్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, బొల్లారం మధ్య డబ్లింగ్ పనుల కోసం రూ.6,260 కోట్లతో అంచనాలు పూర్తి చేశామన్నారు. జోన్‌లో కాపలా ఉన్న గేట్లను తొలగించి ఆర్‌వోబీ, ఆర్‌యూబీలను తీసుకువచ్చామన్నారు. తెలంగాణలో మెదక్-అక్కన్నపేట మధ్య నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్‌ను పూర్తి చేయడానికి రూ.54 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్-ఫేజ్ 2 పనుల కోసం రూ.40 కోట్లతో నగర శివారుల వరకు రైల్వే లైన్ పూర్తిచేస్తామన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య కొత్త లైన్ కోసం రూ.235 కోట్లు, మునీరాబాద్-మహబూబ్‌నగర్ మధ్య పనుల కోసం రూ.240 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి పనులకు రూ.520 కోట్లు, కాజీపేట్-్భద్రాచలం మధ్య మూడోలైన్ కోసం రూ.483 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి మధ్య కొత్త లైన్ కోసం రూ.1,198 కోట్లు, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనులకు రూ.294 కోట్లు, విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, నర్సాపూర్, నిడదవోలు మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.1,158 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ మధ్య కొత్త లైన్ కోసం రూ. 551 కోట్ల, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ కోసం రూ.185 కోట్ల, గుత్తి, ధర్మవరం మధ్య (అనంతపూర్ జిల్లా) డబ్లింగ్ పనుల కోసం రూ.135 కోట్లు, కాజీపేట్-విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.404 కోట్లు, విజయవాడ-గూడూరు మధ్య మూడోలైన్ కోసం రూ.664 కోట్లు, ఘట్‌కేసర్-యాదాద్రి కోసం కేవలం 10 లక్షలు మాత్రమే ఖర్చు చేయనున్నారు. విజయవాడ, కాజీపేట, రేణిగుంట, వాడీ స్టేషన్ల వద్ద బైపాస్ రైల్వే మార్గం కోసం రూ.222 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ధర్మవరం-పాకాల మధ్య విద్యుధీకరణ కోసం రూ.25 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల మధ్య విద్యుధీకరణ కోసం రూ.18 కోట్లు, లింగంపేట్-జగిత్యాల-నిజామాబాద్ మధ్య విద్యుధీకరణ కోసం రూ. 15 కోట్లు, గద్వాల-రాయచూర్ మధ్య విద్యుధీకరణ కోసం రూ.10 కోట్లు, చర్లపల్లి (హైదరాబాద్) వద్ద శాటిలైట్ ఏర్పాటు కోసం రూ.5 కోట్లు, కర్నూల్ వద్ద రైల్వే ఫ్యాక్టరీ కోసం రూ.30 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్ రెండవ ద్వారం కోసం రూ.6 కోట్లు, తిరుపతి సమీపంలో ఉన్న తిరుచానూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.11 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో రైల్వే సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

*చిత్రం... రైల్ నిలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్